Aryan Khan Drugs Case: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీలో అసలు నిజాలేంటి ? షారూఖ్‌ కొడుకు అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా?

ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై అసలు నిజాలేంటి ? షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా ? క్రూయిజ్‌లో ఎన్సీబీ అధికారుల

Aryan Khan Drugs  Case: ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీలో అసలు నిజాలేంటి ?  షారూఖ్‌ కొడుకు అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా?
Aryan Khan
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 07, 2021 | 2:11 PM

Sharukh Khan Son Case: ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై అసలు నిజాలేంటి ? షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందా ? క్రూయిజ్‌లో ఎన్సీబీ అధికారుల దాడి వెనుక బీజేపీ కుట్ర ఉందా ? ముమ్మాటికి ఇది నిజమంటున్నారు ఎన్సీపీ నేతలు. క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీ వ్యవహారం ఎన్‌సీపీ వర్సెస్‌ ఎన్సీపీగా మారింది. అయితే తాము ప్రభుత్వ ఉద్యోగులమని , ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఎన్సీపీ నేతల ఆరోపణలకు కౌంటర్‌ ఇస్తున్నారు ఎన్‌సీబీ అధికారులు

ఎన్సీబీ కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ముఖ్యంగా బీజేపీ నేతలకు ఏం పని అంటే సూటిగా ప్రశ్నించారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ . ఆర్యన్‌ అరెస్ట్ సమయంలో ఎన్‌బీబీ కార్యాలయానికి సంబంధించి కొత్త వీడియోను ఆయన విడుదల చేశారు. క్రూయిజ్‌లో దాడి జరగకముందే ఎన్‌స్‌బీ కార్యాలయంలో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కిరణ్‌ గోసావి , బీజేపీ నేత మనీష్‌ భానుషాలి ఉన్నారని ఆరోపించారు నవాబ్‌ మాలిక్‌.

అయితే ఈ ఆరోపణలను ఎన్సీబీ అధికారులు తీవ్రంగా ఖండించారు కిరణ్‌ గోసావి , మనీష్‌ భానుషాలి క్రూయిజ్‌లో సోదాలు , సోదాల తరువాత సమయంలో కూడా సాక్ష్యులుగా ఉన్నారని వివరణ ఇచ్చారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం మాత్రమే అని అంటున్నారు.

Read also: Nizamabad: మరో ఘోరం.. నిజామాబాద్ టౌన్‌లో ఇద్దరు బాలికలపై మృగాడి దుర్మార్గం