Sri Krishna Jewellers: భారీ గోల్డ్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు తీవ్రం.. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షాపులన్నింటిలోనూ సోదాలు

భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు తీవ్రం చేసింది. మణీలాండరిగ్ ఆరోపణలపై DRI 2019కేసు ఆధారంగా హైదరాబాద్‌ నగరంలో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ

Sri Krishna Jewellers:  భారీ గోల్డ్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు తీవ్రం.. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షాపులన్నింటిలోనూ సోదాలు
Follow us
Venkata Narayana

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2021 | 9:35 PM

Sri Krishna Jewellers: భారీ గోల్డ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు తీవ్రం చేసింది. మణీలాండరిగ్ ఆరోపణలపై DRI 2019కేసు ఆధారంగా హైదరాబాద్‌ నగరంలో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మీద దాడులు చేస్తోంది. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 DRI కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలో డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో ఈ భారీ కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే దర్యాప్తులో ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు, 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు సైతం గుర్తించారు.

ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించిన ఈడీ, ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపని వైనంపై కూపీ లాగుతోంది. దీంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, శ్రీకృష్ణా జ్యువెలర్స్ దేశవ్యాప్తంగా మొత్తం 35 షోరూంలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Sri Krishna Jewellers

Sri Krishna Jewellers

Read also: TTD Member Jupally: తిరుమల శ్రీవారి నవనీత సేవ, దర్శనంలో తరించిన టీటీడీ బోర్డ్ మెంబర్ జూపల్లి రామేశ్వర్ రావు