Road Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కాపాడిన అధికారి.. వీడియో వైరల్..

చాలా మందికి తమ జీవితంలో వెంట్రుకవాసిలో ప్రాణాపాయం తప్పిపోయిన ప్రమాదాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రమాదాల్లో పక్కవారు మిమ్మల్ని కాపాడి ఉంటారు...

Road Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కాపాడిన అధికారి.. వీడియో వైరల్..
Accident
Follow us

|

Updated on: Oct 08, 2021 | 6:44 PM

చాలా మందికి తమ జీవితంలో వెంట్రుకవాసిలో ప్రాణాపాయం తప్పిపోయిన ప్రమాదాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రమాదాల్లో పక్కవారు మిమ్మల్ని కాపాడి ఉంటారు. ఇలానే ఓ పోలీసు అధికారి సహోద్యోగినిని ప్రమాదం నుంచి కాపాడారు. అతను కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

యూఎస్ఏలో జరిగిన కారు ప్రమాదం నుంచి పోలీసు అధికారి తన సహోద్యోగిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వర్జీనియాలోని గేట్ సిటీ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసు కారు దగ్గర ఇద్దరు పోలీసులతోపాటు ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటుండగా ఓ కారు వాళ్లపైకి వేగంగా దూసుకొచ్చింది. మగ పోలీసు అధికారి వెంటనే స్పందించి తన మహిళా సహోద్యోగికి కాపాడినట్లు వీడియోలో ఉంది. ఆమె పేరు జెస్సికా మెక్‌గ్రా కాగా అతని పేరు మాథ్యూ స్టీవర్ట్‎గా తెలిపారు. ఈ ఘటన యూఎస్ హైవే 23లో జరిగింది. ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన తర్వాత మాథ్యూ స్టీవర్ట్‎ కారు డ్రైవర్‎ను తనిఖీ చేశాడు. జెస్సికా మెక్‌గ్రా అగ్నిమాపక, రెస్క్యూ యూనిట్లకు ఫోన్ చేసింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి పోలీసు కారును ఢీకొట్టినట్లు అక్కడి పత్రికలు రాశాయి.

Read Also.. Festival Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. దసరా రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు