MAA Elections 2021: మా ఎన్నికలపై కాయ్ రాజా కాయ్.. బెట్టింగ్ రాయుళ్ల మొగ్గు ఆయన వైపే..?
Prakash Raj vs Manchu Vishnu: సరిగ్గా ఐపీఎల్ సీజన్‌లోనే 'మా' ఎన్నికల చిత్రం మొదలవడంతో.. బెట్టింగ్ రాయుళ్లు కూడా ఇటువైపు డీవియేట్ అయ్యారు. అటు... మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు... మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య ప్రిస్టీజియస్ ఇష్యూలా మారాయి.
Prakash Raj vs Manchu Vishnu: సరిగ్గా ఐపీఎల్ సీజన్‌లోనే ‘మా’ ఎన్నికల చిత్రం మొదలవడంతో.. బెట్టింగ్ రాయుళ్లు కూడా ఇటువైపు డీవియేట్ అయ్యారు. అటు… మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు… మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య ప్రిస్టీజియస్ ఇష్యూలా మారాయి. రెండు వైపుల నుంచి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలవడంతో ఫలితం మీద అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఒకరోజు ఒకరిది పైచేయి అయితే మరోరోజు మరొకరికి హైప్ వచ్చేస్తోంది. 10వ తేదీనాటికి పరిస్థితి ఎటువైపు బెండ్ అవుతుందన్న డైలమా నెలకొంటోంది.
ఓ రకంగా మా ఎన్నికలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని రేపింది. గతంలో మా ఎన్నికలు గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి. కొన్నిసార్లు పోటీ లేక ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. కానీ.. 2015, 2017, 2019 మా ఎలక్షన్స్ రచ్చకెక్కేశాయి. 2015లో జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటీపడ్డప్పుడు… ఇండస్ట్రీ నిట్టనిలువునా రెండు గ్రూపులుగా విడిపోయింది. మా ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయని మురళీమోహనే ఓపెన్‌గా చెప్పారు. కానీ… మా ఎన్నికల్ని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో సమానంగా చూడ్డం గర్వంగా వుందని కూడా భుజాలెగరేశారు. అప్పట్లో జయసుధకు ఫేవర్‌గా ఎక్కువ బెట్టింగ్ జరిగింది. కానీ.. రాజేంద్రప్రసాద్ గెలవడంతో అందరూ మునిగిపోయారు.
ఇప్పుడు వ్యవహారం మరీ ముదిరిపోయింది. లోకల్-నాన్‌లోకల్ ఇష్యూతో మొదలై… మతం రంగు పులుముకునేదాకా వచ్చాయి. రాజకీయాలు కూడా అంటుకున్నాయి. గతంలో సీఎం జగన్‌తో మాట్టాడుతున్నప్పటి విష్ణు ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. మాకు… మా ఎన్నికలకు సంబంధమే లేదు అని ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మా ఎన్నికలపై పొలిటికల్ షేడ్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. విష్ణు నోటి వెంట సడన్‌గా మోదీ పేరు ప్రస్తావనకు రావడం, బీజేపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి సీవీఎల్ నరసింహారావు ప్రకాశ్‌రాజ్‌ని విమర్శించడం లాంటివన్నీ బీజేపీ, నాన్‌బీజేపీ పాకెట్స్‌ని కూడా అలర్ట్ చేశాయి.
ఇంకో మాటలో చెప్పాలంటే… హుజూరాబాద్ ఉపఎన్నిక మీద నడిచిన డిస్కషన్ కంటే… మా ఎన్నికల మీదే ఎక్కువే టాక్‌షో జరుగుతోందిప్పుడు. ఫిలిమ్‌నగర్‌ని దాటి… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘మా’ ఎన్నికల మీదే మేజర్ టాక్ నడుస్తోంది. ఎవరు గెలుస్తారనుకుంటున్నావ్ అని ఒకర్నొకరు అడగడంతో మొదలుపెట్టి… ఎంత పెడతావ్ అని లెక్కలేసేదాకా వెళ్లింది వ్యవహారం. కొన్నిచోట్ల ప్రైవేట్‌గా, మరికొన్నిచోట్ల ఆర్గనైజ్డ్‌గా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు బెట్టింగ్ రాయుళ్లు ప్రకాష్ రాజ్ వైపే ఎక్కువగా మొగ్గుచూపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు అనూహ్యంగా పుంజుకుని ప్రకాష్ రాజ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య హోరాహోరీ ఖాయమన్న సమాచారంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా తలలు పట్టుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉదయం పోలింగ్ మొదలయ్యేసరికి ‘మా’ బెట్టింగ్ ఇంకా పీక్స్‌కి చేరే ఛాన్సుంది.
– రాజా శ్రీహరి, టీవీ9 ET డెస్క్
Also Read..
Bathukamma: ఆడపడుచులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత