Andhra Pradesh: అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పంపిన వాట్సాప్ మెసేజ్.. అందరినీ కలవరానికి గురి చేసింది. అయితే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా..

Andhra Pradesh: అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..
Ap Police
Follow us

|

Updated on: Oct 09, 2021 | 12:42 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పంపిన వాట్సాప్ మెసేజ్.. అందరినీ కలవరానికి గురి చేసింది. అయితే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లోనే స్పందించడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఓ నిండు ప్రాణం నిలబడింది. వివరాల్లోకెళితే.. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రానికి చెందిన సుధాకర్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే ఏమైందో ఏమో గానీ, ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుధాకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పెస్టిసైడ్స్ దుకాణం నుంచి పురుగుల మందు కొనుక్కుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ డబ్బాను చూపుతూ ఫోటో దిగి.. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అనంతరం తన సెల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆందోళన చెందిన ఆ యువకుడి స్నేహితులు, అతని తల్లి బసమ్మ, ఇతర గ్రామస్తులు ఆ గ్రామ పరిసరాలలో తీవ్రంగా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

దాంతో ఈ విషయాన్ని ఉరవకొండ సీఐ శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఆమిద్యాల గ్రామ పరిసరాల్లోని హంద్రీనీవా కాలువ వద్ద ఆ యువకుడు ఉన్నట్లు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పసిగట్టారు. అప్పటికే ఆత్మహత్యాయత్నానికి ఆ యువకుడు సిద్ధంగా ఉన్నాడు. అంతలోనే పోలీసు బృందం, గ్రామస్తులు అక్కడికెళ్లి సుధాకర్‌ను పట్టుకున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సుధాకర్‌కు ఉరవకొండ సి.ఐ శేఖర్ కౌన్సెలింగ్ ఇచ్చి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విషయం తెలిసిన కొన్ని నిముషాల్లోనే యువకుడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన సి.ఐ శేఖర్, ఎస్సైల బృందాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.

Also read:

Government of India: దేశం ముందు మరో పెద్ద సంక్షోభం.. కీలక విషయాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి..!

చాణక్య నీతి: ఈ మూడు విషయాలు విద్య, సంపద, సైన్యాన్ని నాశనం చేస్తాయి.. అవేంటంటే..!

India Corona Updates: దేశంలో కొత్తగా 19,740 పాజిటివ్ కేసులు.. 248 మంది మృతి.. పూర్తివివరాలివే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..