Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: ఈ మూడు విషయాలు విద్య, సంపద, సైన్యాన్ని నాశనం చేస్తాయి.. అవేంటంటే..!

Chanakya Niti: ఆచార్య చాణక్య గురించి తెలియని వారుండరుంటే అతిశయోక్తి కాదు. ఆయన రచనలు ప్రపంచానికే ఆదర్శం. ఆయన చూపిన మార్గం.. అందరికీ అనుసరణీం.

చాణక్య నీతి: ఈ మూడు విషయాలు విద్య, సంపద, సైన్యాన్ని నాశనం చేస్తాయి.. అవేంటంటే..!
Acharya Chanakya
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2021 | 10:37 AM

Chanakya Niti: ఆచార్య చాణక్య గురించి తెలియని వారుండరుంటే అతిశయోక్తి కాదు. ఆయన రచనలు ప్రపంచానికే ఆదర్శం. ఆయన చూపిన మార్గం.. అందరికీ అనుసరణీం. ఆయన వ్యూహాలు.. ప్రత్యర్థులకు ముచ్చెమటలే. విష్ణుగుప్తుడు, కౌటిల్యుడిగా పిలువబడే ఆచార్య చాణక్య.. మౌర్య రాజవంశ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆయన దౌత్య నీతి, చతురతతో చరిత్ర గతినే మార్చేశారు. చేసిన ప్రతిజ్ఞ మేరకు నంద వంశం పతనం చూశారు. ఇదంతా ఇలా ఉంటే.. చాణక్య గొప్ప నైపుణ్యం కలిగిన ఆర్థిక వేత్త, వేద పండితులు, అద్భుతమైన జీవిత మార్గదర్శి. అర్థశాస్త్రం, నీతి శాస్త్రం వంటి ఎంటో గ్రంథాలను రాశారు. ఆయన తన గ్రంథాల్లో చేసిన మార్గనిర్దేశనం.. ఇప్పటికే ప్రతి ఒక్కరికీ ఆచరణీయం. ఆయన చేప్పిన సూచనలు, నీతి వ్యాఖ్యాలను పాటిస్తూ ఎంతో మంది తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరారు. జీవితం పట్ల లోతైన అవగాహన కలిగిన ఆచార్య చాణక్య.. ప్రజలకు ఎన్నో కీలక విషయాలు చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యను సునాయసంగా మనం పాటించే విధానాలతోనే పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఇందులో భాగంగానే.. ఒ వ్యక్తికి విద్య, సంపద, బలగం(సైన్యం) ఎలా దూరం అవుతుంది? వాటికి గల చెడు అలవాట్లు ఏంటనేది చాణక్య తన నీతిశాస్త్రంలో సవివరంగా పేర్కొన్నారు. మరి ఆ మూడు దురలవాట్లు ఏంటి? ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధన చేయడం మానొద్దు… మీరు ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ.. మీ ప్రతిభను కాపాడుకోవడానికి నిత్య సాధన చేస్తూనే ఉండాలి. సాధనతోనే.. మీరు చేసే పని మరింత ప్రతిభావంతంగా ఉంటుంది. ఏ అంశమైనా సాధన చేయాల్సిందే. ఒకవేళ సాధన చేయడం మానేస్తే.. కాల క్రమేణా ప్రతీది మర్చిపోతారు. సంవత్సరాలుగా నేర్చుకున్న విద్య సహా అన్న కోల్పోతారు. అందుకే నిరంతర సాధన తప్పనిసరి అని ఆచార్య చాణక్య తన గ్రంథాల్లో స్పష్టం చేశారు.

డబ్బు విషయంలో ఇతరులపై ఆధారపడొద్దు.. మీరు నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే.. ఆ పనిని మీరే చూసుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక వ్యాపారం పెట్టారంటే.. స్వయంగా మీరే దానిని నిర్వహించడం ఉత్తమం. అలా కాకుండా ఇతరులపై నమ్మకం పెట్టుకుని వదిలేస్తే అసలుకే మోసం జరుగుతుంది. మీ సమయం, డబ్బు వృథా అయిపోతుంది. అంతేకాదు.. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన అంశాల్లో మీ పనులను మీరే చూసుకోవాలి.

నాయకుడు లేని సైన్యం నిర్వీర్యమే.. ఏదైనా పనిని మెరుగైన రీతిలో చేయాలంటే.. దానిని చిన్న చిన్న భాగాలుగా విభిజించి అప్పగించాలి. సైన్యంలో కూడా అంతే. సైన్యాన్ని నిర్వహించే బాధ్యత కమాండర్‌పై ఉంటుంది. అతను సైన్యానికి మార్గనిర్దేశం చేస్తాడు. ఆ మార్గనిర్దేశనం ప్రకారం సైన్యం ముందుకు సాగి విజయం సాధిస్తుంటుంది. కానీ, సైన్యానికి కమాండర్ లేకపోతే.. మార్గనిర్దేశనం చేసే నాయకుడు లేకపోతే.. ఆ సైన్య చెల్లాచెదురవుతుంది. మొత్తానికే నష్టం వాటిల్లుతుంది. అందుకే.. ప్రతీ ఒక్కరూ నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలంటారు ఆచార్య చాణక్య.

Also read:

Post Office Schemes: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అదిరిపోయే బెనిఫిట్స్‌.. రెట్టింపు ఆదాయం..!

Che guevara: పెట్టుబడిదారుల పాలనకు సింహస్వప్నం..చే గువేరా! ఆ విప్లవసింహం హత్య జరిగి 55 ఏళ్ళు!!

IPL 2021: ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..