Post Office Schemes: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అదిరిపోయే బెనిఫిట్స్.. రెట్టింపు ఆదాయం..!
Post Office Schemes: అధిక ఆదాయం కూడబెట్టుకునేందుకు ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసుల్లో..
Post Office Schemes: అధిక ఆదాయం కూడబెట్టుకునేందుకు ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసుల్లో కూడా రకరకాల స్కీమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. . రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందాలని భావిస్తే మాత్రం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం మంచిది. పోస్టాఫీసుల్లో ఉన్న స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర అనే పథకం కూడా ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెట్టింపు డబ్బులు పొందవచ్చు. మీరు దీర్ఘకాలంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని భావిస్తే ఇందులో చేరవచ్చు. బ్యాంకుల్లో వచ్చే వడ్డీ కంటే ఈ పథకంలో అన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. మంచి రాబడి పొందాలనుకునేవారికి ఈ పథకం ఎంతో మంచిది.
ఈ పథకంలో మీ డబ్బుకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 124 నెలల తర్వాత మీ డబ్బు 2 లక్షల రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. కనీసం 18 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. రూ.1000, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.50 వేలు ఇలా మీకు నచ్చిన మొత్తంలో కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు రూ.లక్ష పెడితే మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.2 లక్షలు వస్తాయి.
ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే మూడు నెలలకోసారి మారవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల రేట్లలో మార్పు ఉండవచ్చు.. లేదా.. స్థిరంగా కూడా కొనసాగవచ్చు. సింగిల్, జాయింట్‌లో ఏదైనా ఖాతా తెరవవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరిట ఖాతా తెరవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ఏదైనా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. దరఖాస్తుదారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి. అలాగే ఈ స్కీమ్‌లో నామినీ ఎంపిక కూడా ఉంటుంది.
మెచ్యూరిటీ మొత్తాన్ని పథకం గడువు పూర్తయిన తర్వాత ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి పొందే సౌకర్యం ఉంటుంది. దీని కోసం లబ్దిదారుడు తన గుర్తింపు కార్డులతో పాటు, స్కీమ్‌కు సంబంధించిన స్లిప్‌లు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్దిదారుడికి గుర్తింపు పత్రాలు లేకపోతే కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్‌ను తీసుకుని మీ పోస్టాఫీసు నుంచి మాత్రమే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ముందుకు వచ్చిన వారికి పోస్టాఫీసుల్లో ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.