Fuel Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో పెట్రోల్‌, డీజిల్‌ కొంటున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Fuel Credit Card: ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య పెరిగిపోయాయి. బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులు అందిస్తుండటంతో చాలా మంది కార్డులను..

Fuel Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో పెట్రోల్‌, డీజిల్‌ కొంటున్నారా..? జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!
Fuel Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Oct 09, 2021 | 7:39 AM

Fuel Credit Card: ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డుల సంఖ్య పెరిగిపోయాయి. బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులు అందిస్తుండటంతో చాలా మంది కార్డులను తీసుకుంటున్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో పెట్రోల్‌, డీజిల్‌పై డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్‌ బ్యాక్‌లు ప్రకటిస్తున్నాయి. దీంతో పెట్రోల్‌ బంకుల్లో క్రెడిట్‌ కార్డుల వినియోగం చాలా పెరిగిపోయింది. కొన్ని సంస్థలు బీపీసీఎల్‌, హెచ్‌పీ వంటి చమురు సంస్థలతో కలిసి కో- బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొస్తున్నాయి. ఇక భారత్‌ పెట్రోలియం భాగస్వామ్యంతో ఎస్‌బీఐ ఈ వారంలోనే కో-బ్రాండెడ్‌ రూపే కాంటాక్ట్‌లెస్‌ కార్డులను విడుదల చేసింది. క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్‌ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డులపై అవగాహన ఉండి వాడుకుంటే మంచిది. ఇలా క్రెడిట్ కార్డుల విషయంలో చాలా మంది చిక్కుల్లో  పడ్డ కస్టమర్లు చాలా మందే ఉన్నారు. కార్డు ఉపయోగించడంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయా..? ఉపయోగించుకుంటే ఎలా ప్రయోజనాలు ఉన్నాయి..? ఎలాంటి చిక్కులు వచ్చి పడతాయి..? అనే విషయాలు ముందుగానే తెలుసుకోవడం మంచిది.

ఫ్యూయల్ కార్డును ఎవ‌రు ఉప‌యోగించాలి?:

కార్డు ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా అని ఎడపెడ ఉపయోగిస్తే చిక్కులు తప్పవు. సొంత వాహనాలు ఉపయోగించి ఎక్కువగా ప్రయాణించే వారికి ఇంధన కార్డులు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంధ‌న కొనుగోలు ఎక్కువ‌గా ఉంటే రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఎక్కువ‌గా ఉంటాయి. దీని వల్ల డ‌బ్బు ఆదా అవుతుంది. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థ‌లు చ‌మురు సంస్థ‌ల‌తో క‌లిపి ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని ష‌రతుల‌ను విధిస్తున్నాయి. రోజువారీ లేదా నెల‌వారీగా పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించుకునేవారికి కార్డులతో ఎక్కువ రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇలా రివార్డు పాయింట్ల విషయంలో కూడా కార్డు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

కార్డు విషయంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

నెలవారీ పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులను పోల్చి చూడటం ముఖ్యం. ఇంధన ఖర్చులను ఆదా చేసేందుకు ఫ్యూయల్‌ కార్డును తీసుకోవాలని ప్లాన్‌ చేస్తుంటే జాయినింగ్‌ ఫీజుతో పాటు వార్షిక ఫీజు కూడా ఉంటుంది. అందుకే కార్డుకు అయ్యే ఖర్చుల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొన్ని సంస్థ‌లు వార్షిక వినియోగానికి కొంత టార్గెట్‌ను విధిస్తాయి. అంతకుమించి ఖ‌ర్చు చేస్తే వార్షిక రుసుములు ర‌ద్దు చేస్తాయి. ఒక వేళ ఖ‌ర్చు చేయ‌డంలో విఫ‌లమైతే మొత్తం పొదుపుపై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మీరు కార్డు జారీ చేసిన సంస్థ‌లు తెలిపిన దానికంటే ఎక్కువ ఇంధనంపై ఖ‌ర్చు చేయ‌గ‌లం అనుకుంటే మాత్ర‌మే కార్డును తీసుకోవ‌డం బెటర్‌. క్రెడిట్‌ కార్డులు జారీ చేసే సంస్థలకు చెందిన సిబ్బంది పెట్రోల్‌ బంకుల్లోనే ఉంటారు. మనం పెట్రోల్‌ కోసం వెళ్లినప్పుడు మన దగ్గరకు వచ్చిన క్రెడిట్‌ కార్డుల గురించి, ఇంధనం పోయించుకుంటే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ల గురించి భారీగా చెబుతుంటారు. వాటిని నమ్మి మనం తీసుకునేందుకు ముందుకొస్తాము. ఇలాంటి సమయంలో వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వార్షిక రుసుము, ఇతర ఖర్చులు ఏమైనా ఉంటాయా.? అని తెలుసుకోవడం మంచిది.

పెట్రోల్ పంప్‌ల‌ జాబితా తెలుసుకోండి:

కో-బ్రాండెడ్ కార్డుల విష‌యంలో భాగ‌స్వామి కాని రీఫిల్ స్టేష‌న్‌లో చేసే కొనుగోళ్ల‌పై లాయ‌ల్టీ రివార్డు పాయింట్లు వ‌చ్చే అవ‌కాశం ఉండదు. అందువల్ల వినియోగ‌దారులు తాము ఎక్కువ‌గా ఆయిల్ కొనుగోలు చేసే పంపును తెలుసుకోవడం మంచిది. లాయల్టీ రివార్డు పాయింట్లు రాని స్టేషన్లను ఎంచుకుంటే వచ్చే లాభం ఏమి ఉండదు. అందుకే ఈ విషయంలో కూడా ముందుగానే మీరు పెట్రోల్ పంపుల జాబితాను తెలుసుకోవడం బెటర్.

కార్డు బకాయిలు సకాలంలో చెల్లించాలి..

కార్డు తీసుకోగానే కాదు.. సమయానికి కార్డు బకాయి కూడా చెల్లించడం ముఖ్యం. గ‌డువు తేదీలోపు క్రెడిట్ కార్డు బిల్లుల‌ను పూర్తిగా చెల్లించ‌డంలో విఫలమైతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కార్డు, అది జారీ చేసిన సంస్థ‌పై ఆధార‌ప‌డి 23 శాతం నుంచి 49 శాతం వ‌ర‌కు ఉంటాయి. చాలా మంది కార్డు తీసుకున్న తర్వాత బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తుంటారు.  ఎందుకంటే ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అక్కడే మీరు నష్టపోతారు. ఒక్కసారి ఆలస్యంగా చెల్లిస్తే భారీగానే ఛార్జ్ వేస్తారు. ఇలాంటి సమయంలో మీకు అధికంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల మీరు పొందే ప్రయోజనాలు కూడా కోల్పోతారు. మీరు అధిక ఛార్జీలు పడడమే కాకుండా మీకు అందే రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు కూడా అన్ని కట్ అవుతాయి. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

రివార్డు పాయింట్లు, బోనస్‌లు..

సేక‌రించిన రివార్డు పాయింట్ల‌ను సాధార‌ణంగా భాగ‌స్వామ్య అవుట్‌లెట్స్ వ‌ద్ద ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఎంపిక చేసిన ఆన్‌లైన్ భాగ‌స్వామ్యులు లేదా గిఫ్ట్ ఓచ‌ర్ల రూపంలో రీడీమ్ చేసుకునేందుకు కొన్ని కార్డు జారీ సంస్థ‌లు అనుమ‌తిస్తున్నాయి. రివార్డు పాయింట్ల విష‌యంలో గుర్తించుకోవాల్సిన  మరో ముఖ్య విష‌యం ఎక్స్‌పైరీ డేట్‌ ఎంతో ముఖ్యం. చాలా వ‌ర‌కు ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల‌కు 2 నుంచి 3 సంవ‌త్స‌రాల గ‌డువు ఉంటుంది. కొన్ని జారీ సంస్థ‌లు గడువు తేదీ లేకుండానే కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. ఈ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. అలాగే కొత్త‌గా కార్డు తీసుకునే వారికి కొన్ని సంస్థ‌లు జాయినింగ్ బోన‌స్ లేదా వెల్‌క‌మ్ బోన‌స్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. అందుకే కొత్త‌గా కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వీటిని ప‌రిశీలించాలి. సర్‌ఛార్జీ మినహాయింపు విషయంలో చాలా వరకు ఫ్యూయల్‌ బేస్ట్‌ క్రెడిట్‌ కార్డులు ఈ సదుపాయన్ని అందిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసినప్పుడు 3 శాతం వ‌ర‌కు స‌ర్‌ఛార్జ్ వ‌ర్తించవ్చు. మీ కార్డుపై కూడా ఈ స‌దుపాయం ఉంటే కొంత లేదా పూర్తి స‌ర్‌ఛార్జ్ మిన‌హాయింపు పొందవచ్చు. ఇది కార్డును బ‌ట్టి మారుతుంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం బెటర్‌.

ఇవీ కూడా చదవండి:

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. యోనో యాప్‌ ద్వారా ఉచితంగానే ఆ సేవలు..!

Bank Customers Alert: బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. IMPS ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ పెంపు

Home Loan: ఆ బ్యాంకులో 6.5 శాతానికే హోమ్‌ లోన్స్‌.. కీలక ప్రకటన చేసిన బ్యాంకు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!