- Telugu News Photo Gallery Business photos Attention SBI customers! You can now file Income Tax Returns for free. Here's how
SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యోనో యాప్ ద్వారా ఉచితంగానే ఆ సేవలు..!
SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఉచితంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్ సదుపాయం కల్పిస్తోంది..
Updated on: Oct 08, 2021 | 1:27 PM

SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఉచితంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్ సదుపాయం కల్పిస్తోంది. దీంతో చాలా ఎంతో మందికి ఉపయోగకరంగా మారనుంది. ఎస్‌బీఐ ఈ తరహా సేవల కోసం ట్యాక్స్2విన్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

యోనో యాప్ ద్వారా సులభంగా ఐటీఆర్ దాఖలు చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కావాల్సిందల్లా ఆరు డాక్యుమెంట్లు మాత్రమే. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

యోనోయాప్ ద్వారా ఐటీఆర్ దాఖలుకు కావలసిన పత్రాలు: 1. పాన్ కార్డ్, 2. ఆధార్ కార్డ్, 3. ఫారం 16, 4. పన్ను మినహాయింపు వివరాలు, 5. వడ్డీ ఆదాయం సర్టిఫికేట్లు 6. పన్ను ఆదా పెట్టుబడికి సంబంధించిన ఫ్రూఫ్‌లు. ఎస్‌బీఐ కస్టమర్లు యోనోయాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కొన్నింటిని అనుసరించాల్సి ఉంటుంది. అవేంటంటే..

కస్టమర్ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యోనో యాప్‌కి లాగిన్ కావాలి. షాప్స్ అండ్ ఆడర్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అక్కడ కనిపించే ట్యాక్స్2విన్ ఎంచుకోవాలి. ఇక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను అనుసరించి ఐటీఆర్ సులభంగా దాఖలు చేయవచ్చు.





























