- Telugu News Photo Gallery Business photos Hero MotoCorp: New Hero XPulse 200 4V launched in India at Rs 1,28,150, Specifications
Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్ నుంచి మరో సరికొత్త బైక్.. అద్భుతమైన ఫీచర్స్.. ధర ఎంతో తెలుసా..?
Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్ మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కస్టమర్లకు అనుగుణంగా సరికొత్త ద్విచక్ర వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల ..
Updated on: Oct 09, 2021 | 1:18 PM

Hero XPulse 200 4V: హీరో మోటోకార్ప్ మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కస్టమర్లకు అనుగుణంగా సరికొత్త ద్విచక్ర వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇక తాజాగా ఈ హీరో 'ఎక్స్‌ప్లస్ 200 4వీ'ని విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.28 లక్షలుగా వెల్లడించింది కంపెనీ.

అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్‌లో ఎంట్రి లెవల్ వాహనమైన ఎక్స్‌ప్లస్‌కు 4 వాల్వ్ టెక్నాలజీని వినియోగించింది. దీనికి 199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.8 బీహెచ్‌పీ శక్తిని, 17.35 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

గతంలో ఉన్న టూవాల్స్ టెక్నాలజీ ఇంజిన్ 17.8 బీహెచ్‌పీ శక్తిని మాత్రమే విడుదల చేస్తుండగా, కొత్త ఇంజిన్‌తో శక్తి ఆరు శాతం, టార్క్ ఐదు శాతం పెరిగాయి. ధరలో కూడా రూ.5000 ఎక్కువ.

అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సరికొత్త బైక్‌లో కూలింగ్ వ్యవస్థను కూడా 7ఫిన్ ఆయిల్ ఫిల్టర్లతో మరింత మెరుగు పర్చినట్లు హీరో కంపెనీ తెలిపింది. వేగం, పట్టు కోసం గేర్ వ్యవస్థలో మార్పులు చేశామని, వైబ్రేషన్స్ తగ్గించినట్లు వెల్లడించింది.

ఈ బైకు ట్రెయిల్‌బ్లూ, బ్లిట్జ్ బ్లూ, రెడ్ రైడ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంటిగ్రేడ్ స్టార్టర్, ఇంజిన్ కటాఫ్ స్విచ్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, బ్లూటూత్ అనుసంధానించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏబీఎస్ ఫీచర్లు ఉన్నాయి





























