- Telugu News Photo Gallery Business photos Updated TVS Apache RTR 160 4V, TVS Apache RTR 160 4V Special Edition Launched. All Details Inside
TVS Apache: స్పెషల్ ఎడిషన్ అపాచీ RTR 160 4V మార్కెట్లో విడుదల.. అత్యాధునిక ఫీచర్స్.. ఇతర వివరాలు..!
TVS Apache RTR 160 4V: ఆపాచీ ఆర్‌టీఆర్ 160 సిరీస్‌లో సరికొత్త వెర్షన్ మార్కెట్లో విడుదల చేసింది టీవీఎస్ మోటర్స్. ఈబైక్‌లో ఫీచర్లు, లుక్స్ పరంగా కొత్త..
Updated on: Oct 10, 2021 | 1:16 PM

TVS Apache RTR 160 4V: ఆపాచీ ఆర్‌టీఆర్ 160 సిరీస్‌లో సరికొత్త వెర్షన్ మార్కెట్లో విడుదల చేసింది టీవీఎస్ మోటర్స్. ఈబైక్‌లో ఫీచర్లు, లుక్స్ పరంగా కొత్త అప్‌డేట్స్ ఈ లేటెస్ట్ మోడల్‌లో ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర. రూ.1.21 లక్షలు. ఈ స్పెషల్ వేరియంట్‌లో బేస్ మోడల్ ధర రూ.1,15,265 (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ)గా ఉంది. అలాగే డ్రమ్ బ్రేక్స్ కలిగిన మోడల్ ధరను రూ.1,21,272గా (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ) నిర్ణయించింది కంపెనీ. అత్యాధునిక టెక్నాలజీని ఈ బైక్ ద్వారా అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఈ సరికొత్త వాహనం ఫీచర్లలో హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో మార్పు చేశారు. కొత్త డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (డీఆర్‌ఎల్), మూడు రైడ్ మోడ్స్ (స్పోర్ట్, అర్బన్, రెయిన్), అడ్జస్టబుల్ బ్రేక్స్, క్లచ్ లీవర్స్‌తో పాటు టీవీఎస్ స్మార్ట్ ఎక్స్‌కనెక్ట్ వంటివి అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ స్పెషల్ ఎడిషన్ రెడ్ కలర్ అలాయ్ వీల్స్, సరికొత్త సీట్ ప్యాటర్న్‌లను కలిగి ఉంది. ఈ బైక్ రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ, నైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

స్టాండర్డ్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4Vని ఈ ఏడాది మార్చిలోనే ప్రవేశపెట్టింది టీవీఎస్ మోటర్స్. తాజాగా స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అపాచీ సిరీస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో అందుబాటులోకి రానున్న ఈ స్పెషల్ ఎడిషన్‌లో.. కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్స్ అమ్మకాలను పెంచుతాయని సంస్థ ఆశిస్తోంది.

అపాచీ ఆర్‌టీఆర్ 160 4V మోటర్ బైక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 9250 ఆర్‌పీఎంతో 17.63 పీఎస్ శక్తిని అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. 7250 ఆర్‌పీఎం దగ్గర 14.73 ఎన్ఎం టార్క్ దీని ప్రత్యేకత. 5 స్పీడ్ స్లిక్ గేర్ బాక్స్‌కు ఇంజిన్ అనుసంధానమై ఉంటుంది.





























