Home Loan: ఆ బ్యాంకులో 6.5 శాతానికే హోమ్ లోన్స్.. కీలక ప్రకటన చేసిన బ్యాంకు
Home Loan: గృహ రుణాలు పొందేవారికి బ్యాంకులు గుడ్‌న్యూస్ అందిస్తున్నాయి. వడ్డీ శాతం తక్కువగా విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం..
Home Loan: గృహ రుణాలు పొందేవారికి బ్యాంకులు గుడ్‌న్యూస్ అందిస్తున్నాయి. వడ్డీ శాతం తక్కువగా విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం గృహ రుణాలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి అవకాశమే. లోన్ తీసుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ప్రభుత్వ రంగానికి ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. ఈ బ్యాంకులో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేసింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.హోమ్ లోన్ వడ్డీ రేటు 6.50 శాతానికి దిగొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది.
ఈ బ్యాంకు తాజాగా వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఊరట కలిగించినట్లయింది. అక్టోబర్ 7 నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చింది. ఈ వడ్డీ రేట్లు డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది. తక్కువ వడ్డీకే గృహ రుణం పొందవచ్చు. ఇకపోతే కొత్తగా గృహ రుణం తీసుకునేవారికి, అలాగే ఇతర బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా.. ఇంకా లోన్ రీఫైనాన్స్ చేసుకోవాలని భావించే వారు తక్కువ వడ్డీ రేటు ప్రయోజనం పొందవచ్చని సదరు బ్యాంకు వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు బెనిఫిట్ కూడా ఉంది. అలాగే పండగ సీజన్‌లో భాగంగా చాలా బ్యాంకులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ శాతం తగ్గించాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఆఫర్లు ఇచ్చాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గృహ రుణాలపై వడ్డీ శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, బ్యాంకులు పోటాపోటీగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు భారీగానే తగ్గిస్తున్నాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తుండగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 వడ్డీ రేట్లకు గృహ రుణాలను పొందవచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 6.70 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 6.70 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.80 వడ్డీ రేటు వసూలు చేస్తోంది.