Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?

Blue Color Aadhaar: ప్రస్తుత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర అవసరాలకు ఆధార్‌ కార్డు..

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?
Blue Color Aadhaar
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2021 | 8:26 AM

Blue Color Aadhaar: ప్రస్తుత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర అవసరాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. ప్రతి భారతీయ పౌరునికి ఇది తప్పనిసరిగా మారింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఈ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేవలం ఐడెంటిటీ ప్రూఫ్​, అడ్రస్​ ప్రూఫ్​లా మాత్రమే కాదు ప్రతి అవసరానికి కీలకంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్​ కార్డు కోసం నమోదు చేసుకోవాల్సిందే. అయితే 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్​ కార్డును బాల్​ ఆధార్ కార్డు అంటారు. ఈ ఆధార్​ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు అందించాలో చూద్దాం.

భారత ప్రభుత్వం పిల్లల కోసం బాల్ ఆధార్​ పేరుతో ప్రత్యేక ఆధార్​ కార్డును జారీ చేస్తోంది. ఇది నీలం రంగులోనూ, సాధారణ కార్డుకు కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్​ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేస్తామో దీనిని కూడా అలాగే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆధార్​ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్​, అడ్రస్​ ప్రూఫ్ ,ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, పిల్లల పుట్టిన తేదీ డాక్యుమెంట్లను జతచేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐ మొత్తం 31 ఐడెంటిటీ ప్రూఫ్​, 44 అడ్రస్​ ప్రూఫ్​, 14 ప్రూఫ్​ ఆఫ్​ రిలేషన్​షిప్​, 14 డేటా ఆఫ్​ బర్త్​ ప్రూఫ్​ డాక్యుమెంట్లను అంగీకరిస్తుంది ఆధార్‌ సంస్థ. వీటిలో దేనినైనా ఆధార్‌ నమోదుకు ఫ్రూప్‌గా అందించవచ్చు.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ నీలం రంగులోని బాల్ ఆధార్ కార్డును పొందడానికి అర్హులు. వారికి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బాల్​ ఆధార్​ చెల్లదు. ఆ తర్వాత మళ్లీ అప్​డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల స్కూల్​లో ఇచ్చే ఐడెంటిటీ కార్డును ఉపయోగించి ఆధార్​కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలకు ఆధార్‌ నమోదు చేసే ముందు తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ఆధార్‌ను అందిస్తారు.

చిన్నారుల బయోమెట్రిక్ ఆధార్ డేటాను 5 సంవత్సరాల వయస్సులో, మళ్లీ 15 సంవత్సరాల వయస్సులో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి తీసుకున్న డిశ్చార్జ్ స్లిప్‌తో బాల ఆధార్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ డేటాలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారం ఉండదు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత, బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకు ఈ విధంగా ఆధార్‌ను జారీ చేస్తారు. గతంలో పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా ఆధార్‌ నమోదు చేసుకునే వారు. కానీ ఇప్పుడు పిల్లల పేరుపై ఏదైనా బ్యాంకు లావాదేవీలు, పాఠశాలల్లో చేర్పించే సమయంలో, ఇతర వ్యవహారాల్లో ఆధార్‌ అందించడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఐదు సంతవ్సరాల్లోపు ఉన్న పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు పొందడం తప్పనిసరి అయ్యింది.

ఇవీ కూడా చదవండి:

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ

Post Office Scheme: రూ. 100 పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు..

PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..!