Moto E40: మోటోరోలా నుంచి స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లోనే.. పూర్తి వివరాలు..!

Moto E40: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి..

Moto E40: మోటోరోలా నుంచి స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లోనే.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2021 | 10:29 AM

Moto E40: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి మొబైల్‌ కంపెనీలు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. ఇక భారత్‌లో మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యింది. మోటోE40 పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మోటోరోలా ట్వీట్‌ చేసింది.

మోటో ఈ40 ‘ది పర్ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల చేసేది వెల్లడించలేదు. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరలో లేదా నవంబర్‌ తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారత్‌లో రూ. 10 వేల లోపు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోటో ఈ40 స్మార్ట్‌ఫోన్‌ గ్రే, పింక్‌ కలర్‌ వేరియంట్‌ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ అంచనా ప్రకారం పరిశీలిస్తే..

► 6.5-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే

► 1,600×720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్‌ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌

► ఆండ్రాయిడ్‌ 11

► 4జీబీ ర్యామ్‌+ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

► 42+2+2 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

► 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

► ఫింగర్‌ ప్రింట్‌సెన్సార్‌

► యునిసోక్‌ టీ700 ప్రాసెసర్‌

► టైప్‌ సీ చార్జింగ్‌ సపోర్ట్‌

► 4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

కాగా, మోటోరోలా నుంచి ఇప్పటికే బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు ఎన్నో విడుదలయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో మార్కెట్లో పోటీ ఉండటంతో మోటోరోలా కూడా తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి ధర, ఫీచర్స్‌పై పూర్తి వివరాలు తెలియనుంది.

ఇవీ కూడా చదవండి:

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ

Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!