Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Oct 08, 2021 | 6:31 AM

Smartphone Sells: దసరా, దీపావళి పండగ సీజన్‌లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కసమర్లను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను..

Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!

Follow us on

Smartphone Sells: దసరా, దీపావళి పండగ సీజన్‌లో రకరకాల స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కసమర్లను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్‌ తయారీ కంపెనీలు. అలాగే పండగ సీజన్‌లో ఈకామర్స్‌ దిగ్గజాలు కూడా ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటగి బాటలోనే చైనా కంపెనీ షావోమీ కూడా దూసుకుపోతోంది. వినియోగదారులకు దీపావళి సేల్‌ విత్‌ ఎమ్‌ఐ సేల్‌ ను ప్రకటించింది. ఈ సేల్‌పై కూడా వినియోగదారులు భారీగా మొబైళ్లను కొనుగోలు చేశారు. కేవలం ఐదు రోజుల్లో 20 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని షావోమీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో భాగంగా షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ5జీ, మిడియమ్‌ సెగ్మెంట్‌లో ఎమ్‌ 11ఎక్స్‌, రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో, రెడ్‌మీ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం రికార్డు స్థాయిలో 10 శాతం వరకు అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కారణంగా మొబైల్‌ కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్‌ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి. ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే షావోమీ దూసుకెళ్తోంది. అతి తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో సామాన్య జనాలు కూడా ఎంఐ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంఐ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుంటున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త కొత్త డివైజ్‌లను ఆవిష్కరిస్తున్నామని అన్నారు. ఎంఐ తన అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ప్రస్తుతం కొనసాగుతున్న అనేక రకాల డీల్స్‌ ద్వారా 2 మిలియన్‌ల సేల్‌ మార్క్‌ సాధించినట్లు చెప్పారు. ఈ డీల్స్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్‌, ఆఫర్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లతో పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లతో పాటు తక్షణ డిస్కౌంట్లను కూడా అందించినట్లు చెప్పారు. ఈ సేల్‌లో భారీగా ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు. తమ సేల్‌ ద్వారా చాలా మంది కస్టమర్లు లాభపడినట్లు పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Post Office Scheme: రూ. 100 పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో రూ. 20 లక్షలు సంపాదించవచ్చు..

PM Kisan: కేంద్రం శుభవార్త.. రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఎప్పుడంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu