Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ

Hyderabad Tour Package: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కరోనా కాలంలో పర్యాటకులకు ఇబ్బందికరంగా మారింది. ఎటు వెళ్లాలన్న ఆంక్షలు..

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2021 | 8:03 AM

Hyderabad Tour Package: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కరోనా కాలంలో పర్యాటకులకు ఇబ్బందికరంగా మారింది. ఎటు వెళ్లాలన్న ఆంక్షలు ఉండటంతో టూర్లు వెళ్లేవారి విరమించుకున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో వివిధ నగరాల పర్యటనకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పుడు దసరా పంగగ సెలవులు రావడంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌ అందించింది ఐఆర్‌సీటీసీ. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఓరోజు సరదాగా గడపాలని భావించే వారికి మంచి అవకాశం. దీంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త అందిస్తోంది. ఒకరోజు హైదరాబాద్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ‘హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్’ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు కేవలం ఒక్క రోజులో హైదరాబాద్ నగరాన్ని చుట్టేయవచ్చు.

సోమవారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఈ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. హైదరాబాద్‌లో నివసించేవారు మాత్రమే కాదు… ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతోగానే ఉపయోగపడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉదయం 8 గంటలలోపు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారు ప్రయాణ సమయానికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ చూపించాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉదయం 8 గంటలకు ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. ట్యాంక్ బండ్, బిర్లామందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి చూపిస్తారు. ఇవన్నీ సందర్శించిన తర్వాత పర్యాటకుల్ని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో వన్‌డే టూర్‌ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. పర్యాటకులు ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.1,115 మాత్రమే. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.1665, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.3320 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. పర్యాటక స్థలాల్లో ఎంట్రెన్స్ ఫీజు, అకామడేషన్, ఫుడ్ లాంటివి ఈ ప్యాకేజీలో ఉండవు. సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

AP True-up Charges: కరెంటు బిల్లులపై వినియోగదారులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Smartphone Sells: పండగ సీజన్‌లో దూసుకుపోతున్న ఎంఐ.. రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు..!