AP-TS Weather Report: అరేబియా సముద్రంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
AP-TS Weather Report: ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.
AP-TS Weather Report: ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 10వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. అధికాస్తా 4 5 రోజుల్లో దక్షిణ ఒడిసా ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇదిలాంటేతూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపారు.
ఈ ఉపరితల ఆవర్తం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా, తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. కాగా, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నాడు కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
Also read:
Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..
WHO Warning: కరోనా వైరస్ ముప్పు ఇంకా పోలేదు.. కీలక హెచ్చరిక జారీ చేసిన డబ్ల్యూహెచ్‌వో
Crime News: స్కూలుకు వెళ్లొస్తానమ్మా అంటూ వెళ్లాడు.. అవే చివరి మాటలయ్యాయి.. తేలు కాటేయ్యడంతో..