Nokia T20 Tablet: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. అధిక బ్యాటరీ సామర్థ్యం..!

Nokia T20 Tablet: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ నోకియాకు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. నోకియా టి 20 టాబ్లెట్​..

Nokia T20 Tablet: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. అధిక బ్యాటరీ సామర్థ్యం..!
Follow us

|

Updated on: Oct 08, 2021 | 11:03 AM

Nokia T20 Tablet: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ నోకియాకు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. నోకియా టి 20 టాబ్లెట్​ పేరుతో బుధవారం దీనిని మార్కెట్లో విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించిన ఈ ట్యాబ్లెట్‌ ధర రూ.20వేల వరకు ఉండనుంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నోకియా.. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ ల్యాబ్లెట్‌ను విడుదల చేసింది. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా దీనిని రూపొందించింది.

నోకియా టి 20 ధర, లభ్యత:

నోకియా టి 20 ట్యాబ్లెట్‌ వైఫై, వైఫై ప్లస్‌ 4జీ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లో విడుదలైంది. దీని వై-ఫై వేరియంట్ సుమారు రూ. 17,200, వైఫై + 4జీ వేరియంట్​ సుమారు రూ. 20,600 ధర వద్ద ప్రారంభమవుతుంది. వైఫై వేరియంట్ 3జీబీ ర్యామ్​+ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్​+ 64 జీబీ స్టోరేజీలో ఉంది. అయితే, వైఫై ప్లస్​ 4G మోడల్ మాత్రం సింగిల్​ 4 జీబీ + 64 జీబీ కాన్ఫిగరేషన్​లో లభిస్తుంది. ఈ వేరియంట్లు అక్టోబర్ 6 నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. టి 20 ట్యాబ్లెట్​తో పాటు ఉచిత స్పాటిపై సబ్​స్క్రిప్షన్​ లభిస్తుంది. ఇందులో 70 మిలియన్లకు పైగా పాటలు, 2.9 మిలియన్ పాడ్‌కాస్ట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

నోకియా టి 20 ఫీచర్స్‌..

నోకియా టి 20 ట్యాబ్లెట్​ సైజు 10.4 అంగుళాల 2K ఇన్-సెల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ యూనిసాక్​ T610 SoC ప్రాసెసర్​తో రన్‌ అవుతుంది. ఇది 3 జీబీ, 4 జీబీ ర్యామ్, 32 జీబీ, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోటోలు, వీడియోల కోసం, నోకియా టి 20 ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా, వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లను అందించింది. దీని వెనుకవైపు ఎల్​ఈడీ ఫ్లాష్‌ కెమెరాను కూడా చేర్చింది. కనెక్టివిటి విషయానికొస్తే 4 జి ఎల్‌టిఈ, వై-ఫై, బ్లూటూత్ v5.0, యూఎస్​బీ టైప్-సి, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. 8,200mAh బ్యాటరీ ఉంది. ఇందులో 15W ఛార్జర్ ద్వారా ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్టు చేస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Moto E40: మోటోరోలా నుంచి స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లోనే.. పూర్తి వివరాలు..!

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?