WhatsApp: ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ప్రైవసీ ఫీచర్‌ త్వరలో రాబోతోంది..!

WhatsApp:ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన కస్టమర్లకు ప్రైవసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తన కస్టమర్ల డేటా విషయంలో జాగ్రత్తలు..

WhatsApp: ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ప్రైవసీ ఫీచర్‌ త్వరలో రాబోతోంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2021 | 11:23 AM

WhatsApp:ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన కస్టమర్లకు ప్రైవసీపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తన కస్టమర్ల డేటా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. డేటా ఇతర వ్యక్తులకు కనిపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందుకు తగినట్లుగానే ఫీచర్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌.. ఇప్పుడు ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. వాట్సాప్ ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ (My Contact Except)’ అనే ప్రైవసీ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తాజాగా నివేదించింది. ఈ కొత్త కస్టమ్ ప్రైవసీ సెట్టింగ్‌తో మీ లాస్ట్ సీన్ స్టేటస్ మీ కాంటాక్ట్స్‌లోని మీకు కావాల్సిన వారికే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

సాధారణంగా ఏదో ఒక సందర్భంలో యూజర్లు తమ లాస్ట్ సీన్ స్టేటస్ కాంటాక్ట్స్‌లోని కొన్ని అకౌంట్లకు కనిపించకుండా దాచిపెట్టాలనుకుంటారు. ప్రస్తుత వాట్సాప్ ఫీచర్స్‌తో అది సాధ్యం కాదు. దీంతో చాలామంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లతో పాటు ఐఓస్ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ని పరిశీలిస్తోంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఫీచర్‌లో మరింత డెవలప్‌ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

అయితే ఐఓస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒకేసారి ఈ ఫీచర్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. ఈ కొత్త ఫీచర్‌ను లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, అబౌట్ వంటి కేటగిరీలలో ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్.. Everyone, My Contacts, Nobody అనే మూడు ప్రైవసీ ఆప్షన్స్ అందిస్తోంది. త్వరలోనే ఈ ప్రైవసీ ఆప్షన్స్‌‌కి కొత్తగా My contacts except అనే ఆప్షన్ యాడ్ కానుంది. ఈ ప్రైవసీ ఆప్షన్‌లతో మీ లాస్ట్ సీన్ టైమ్, ప్రొఫైల్ ఫోటో, వాట్సాప్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని మీ కాంటాక్ట్స్ లో ఉన్నవారు మాత్రమే చూసేలా ఉపయోగపడనుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఆన్‌లైన్‌ స్టేటస్‌ ఎవరికీ కనిపించకుండా హైడ్‌ చేయడానికి వీలులేదు. వాట్సాప్ తన యూజర్లను బ్లూ టిక్‌లను, చాట్ లాస్ట్ సీన్ టైమ్ మాత్రమే హైడ్ చేయడానికి అనుమతి ఉంది. ప్రస్తుతం పరిశీలిస్తున్న సరికొత్త కస్టమ్‌ ప్రైవసీ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు తదుపరి అప్‌డేట్‌లో వచ్చే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో నివేదించింది.

ఇవీ కూడా చదవండి:

Nokia T20 Tablet: నోకియా టీ 20 ట్యాబ్లెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. అధిక బ్యాటరీ సామర్థ్యం..!

Google Two Step Verification: గూగుల్‌ సంచలన నిర్ణయం.. హ్యాకర్లకు చెక్‌.. యూజర్‌ అనుమతి లేకుండానే..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం