Telugu News Photo Gallery Cricket photos ipl points table 2021 standings ranking orange cap purple cap after delhi capitals vs royal challengers bangalore telugu 09102021
IPL 2021: ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..
IPL 2021: ఐపీఎల్ 2021లో లీగ్ స్టేజి ముగిసింది. రేపటి నుంచి ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. చివరి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి...
ఐపీఎల్ 2021లో లీగ్ స్టేజి ముగిసింది. రేపటి నుంచి ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. చివరి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది.
1 / 4
10 విజయాలతో, 4 పరాజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9 విజయాలతో 5 పరాజయాలతో 18 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 18 పాయింట్స్, కోల్‌కతా 14 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
2 / 4
ఆరెంజ్ క్యాప్: కెఎల్ రాహుల్(626) అగ్రస్థానంలో.. డుప్లెసిస్(546) రెండో స్థానంలో.. శిఖర్ ధావన్(544), రుతురాజ్ గైక్వాడ్(533), మ్యాక్స్‌వెల్(498)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
3 / 4
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(30 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(22 వికెట్లు) రెండు, జస్ప్రిత్ బుమ్రా(21 వికెట్లు), షమీ(19 వికెట్లు), రషీద్ ఖాన్(18 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.