Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్‌.. చూస్తే అవాక్కవుతారు..

Navaratri 2021: దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత విగ్రహాలను నెలకొల్పి వివిధ రూపాల్లో అలంకరణ

Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్‌.. చూస్తే అవాక్కవుతారు..
Durgamma
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2021 | 9:08 AM

Navaratri 2021: దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత విగ్రహాలను నెలకొల్పి వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలను చేస్తున్నారు. దుర్గమ్మను నెలకొల్పేందుకు వినూత్న రీతిలో మండపాలు వేస్తున్నారు. ఇక కాళికా దేవి కొలువైన కోల్‌‌కతాలో అయితే నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి కోసం అద్భుతమైన మండపాలను ఏర్పాటు చేసి వాటిల్లో ఆదిపరాశక్తిని నెలకొల్పి పూజారాధనలు చేస్తారు. తాజాగా కోల్‌కతా ప్రజలు ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి వినూత్నమైన కొత్త థీమ్‌తో మండపం నిర్మించారు. ఈ థీమ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది.

ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ థీమ్‌పై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇంతకీ విశేషం ఏంటంటే.. కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో దుబాయ్ బుర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన పండల్‌ను నిర్మించారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా థీమ్ ఆధారంగా క్లబ్ లేక్-టౌన్‌లో 145 అడుగుల పండల్‌ని రూపొందించారు. ఆ పండల్‌లో దుర్గామాతను నెలకొల్పి ఆరాధిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ప్రతి సంవత్సరం, తాము ఐకానిక్ భవనాల ప్రతిరూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బూర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా మండపాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Also read:

Anand Deverakonda: దూసుకుపోతున్న దేవరకొండ బ్రదర్.. ‘హైవే’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆనంద్ దేవరకొండ..

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో కుట్టు హల్వా చేయండి.. అల్పాహారంలో ఆరోగ్యం.. ఆధ్యాత్మికం..రెండూ..

Wife and Husband Clashes: అమెరికా నుంచి వచ్చిన భర్త.. ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య.. అసలు కారణం ఏంటంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!