Government of India: దేశం ముందు మరో పెద్ద సంక్షోభం.. కీలక విషయాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి..!
Government of India: ఇప్పటికే కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న భారతదేశం ముందు మరో సంక్షోభం నిల్చుందా?.. మరికొద్ది రోజుల్లో దేశం అతిపెద్ద విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా?..
Government of India: ఇప్పటికే కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న భారతదేశం ముందు మరో సంక్షోభం నిల్చుందా?.. మరికొద్ది రోజుల్లో దేశం అతిపెద్ద విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్. భారతదేశం అతి పెద్ద విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని స్వయంగా కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ ప్రకటించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. కరెంట్ కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయక ముందు రోజే కరెంట్ కోతలు, చార్జీల పెంపు ఉంటుందని ఆర్‌కే సింగ్ వెల్లడించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందని, దీని కారణంగానే విద్యుత్ సంక్షోభం తలెత్తనుందని అన్నారు. ఒక్కో ప్లాంట్‌కు 80 వేల టన్నుల వరకు బొగ్గు కొరత ఏర్పడుతుందన్నారు. దీని పర్యావసానంగా రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు పెంచాల్సి వస్తుందన్నారు. మరో 6 నెలల పాటు కరెంట్‌కు కష్టాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై దేశంలోనే అత్యంత ఎక్కువ విద్యుత్‌ని ఉత్పత్తి చేసే ఎన్‌టీపీసీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్‌తో చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. బొగ్గు కొతర ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నామని, బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
బొగ్గు కొరతకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం మేర పెరిగిందని వివరించిన ఆయన.. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1-2 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్లు లేఖలో పేర్కొన్న సీఎం జగన్.. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని మోదీకి వివరించారు. ఏపీ జెన్‌కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేరకు తీర్చగలుగుతోందన్నారు. రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో, ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని ప్రధానిని కోరారు జగన్‌మోహన్‌రెడ్డి. పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. అలాగే.. ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని కోరారు సీఎం జగన్.
Also read:
Cruise Drugs Case: నేను అందుకే పార్టీకి వెళ్ళాను.. ఎన్సీబీ ముందు షారూఖ్ తనయుడు ఆర్యన్ ఒప్పుకోలు!
Home Loan: ఈ బ్యాంకులు 35 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. పూర్తి వివరాలు
AP Crime News: గుంటూరు జిల్లాలో దారణం.. చెడు వ్యసనాలకు బానిసైన అల్లుడిపై మామ కత్తితో దాడి