Home Loan: ఈ బ్యాంకులు 35 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. పూర్తి వివరాలు

Home Loan: గృహ రుణం అనేది అత్యంత ప్రజాదరణ పొందిన రుణంగా చెప్పవచ్చు. పండగ సీజన్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వినియోగదారులకు..

Home Loan: ఈ బ్యాంకులు 35 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీకే గృహ రుణాలు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Oct 09, 2021 | 12:03 PM

Home Loan: గృహ రుణం అనేది అత్యంత ప్రజాదరణ పొందిన రుణంగా చెప్పవచ్చు. పండగ సీజన్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వినియోగదారులకు తక్కువ వడ్డీకే గృహరుణాలను అందిస్తున్నాయి. ఈ లోన్స్‌పై గతంలో ఉన్న వడ్డీ శాతాన్ని ప్రస్తుతం భారీగా తగ్గింపు చేశాయి. గృహ రుణాలు పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. జూన్‌ 2021 నాటికి భారత్‌లో హోమ్‌ లోన్స్‌ సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు అందుకున్నారు. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఒక ప్రైవేట్ బ్యాంక్ 35 సంవత్సరాల కాలపరిమితిని గృహ రుణంపై ఆఫర్ చేస్తోంది. ఒక వ్యక్తికి సాధారణంగా 30-32 సంవత్సరాల మధ్య కాలపరిమితితో ఇవ్వడం జరుగుతుంది. అన్ని బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల రుణ వ్యవధిని అందిస్తాయి.

35 సంవత్సరాల పాటు గృహ రుణం:

పండగ సీజన్‌లో భాగంగా యస్ బ్యాంక్ గృహ రుణంపై పరిమిత కాలం (90 రోజులు) ఆఫర్‌ను ప్రకటించింది, ప్రీమియర్ హోమ్ లోన్స్ 6.7శాతం వడ్డీ రేటుతో 35 సంవత్సరాల వరకు సులభమైన ఈఎంఐ (EMI) పద్దతుల్లో చెల్లించవచ్చు. ఇది వన్ టైమ్ ఆఫర్. డిసెంబర్ 31 , 2021 వరకు చెల్లుతుంది .

సాధారణ గృహ రుణం:

ఈ పండుగ సీజన్‌లో అన్ని పెద్ద వాణిజ్య బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ (KMB) సంవత్సరానికి 6.50 శాతం చొప్పున చౌకైన గృహ రుణాన్ని అందిస్తుంది. ఇది గృహ రుణ వడ్డీ రేటును మరో 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ, 30 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే కాలం వరకు సంవత్సరానికి 6.50 శాతం వరకు ఉంటుందని ప్రకటించింది. ఈ ప్రత్యేక రేటు 6.5 శాతం పరిమిత కాలంతో నవంబర్ 8 , 2021న ముగుస్తుంది .

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల గృహ రుణ వడ్డీ రేటు మొత్తాన్ని మరియు రుణ కాలపరిమితితో సంబంధం లేకుండా 6.7శాతంకు తగ్గించింది. రుణాల కాలపరిమితి మూడు సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఇక పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.5శాతం, 6.75% మధ్య తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

CoWIN App: కోవిన్ పోర్టల్‌లో ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్టిఫికెట్.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా.. అందులో ఏముంటుంది!

Post Office Schemes: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అదిరిపోయే బెనిఫిట్స్‌.. రెట్టింపు ఆదాయం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!