Gang Rape in Train: కదులుతున్న రైలులో దారి దోపిడీ.. ఇరవైయేళ్ల యువతి కనిపించడంతో అఘాయిత్యం..!
Gang Rape in Moving Traing: కదులుతున్న రైలులో దోచుకోవడానికి వచ్చిన దుండగులు 20 ఏళ్ల యువతిపై సాముహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.
Gang Rape in Train: మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధులను కట్టడి చేయలేకపోతున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దేశంలో నిర్భయ తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో దోచుకోవడానికి వచ్చిన దుండగులు 20 ఏళ్ల యువతిపై సాముహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన లక్నో నుంచి ముంబైకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఇగత్‌పురి, కాసారా రైల్వే స్టేషన్‌ల మధ్య పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర రైల్వే పోలీసులు తెలిపారు.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలను ముంబై జీఆర్‌పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఎక్స్‌ప్రెస్ ఘాట్ సెక్షన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. నిందితులు లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ బోగీ డీ-2లోకి ఇగత్‌పురి ఎక్కారు. రైలు ఘాట్ ప్రాంతానికి చేరుకోగానే కత్తులు, ఇతర మారణ ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోపిడికి పాల్పడ్డారు. వారి సెల్‌ఫోన్స్, డబ్బులు, నగలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే రైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై నిందితులు సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
రైలు కాసారా రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. ప్రయాణికులు సాయం కోసం కేకలు వేశారని ముంబై జీఆర్‌పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ ట్విట్టర్‌లో తెలిపారు. సిబ్బంది వెంటనే స్పందించారని, నలుగురు నిందితులను పట్టుకున్నామని ఆయన చెప్పారు. బాధితురాలిని మహిళా పోలీస్ అధికారి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించిన ఆయన.. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను రైల్వే పోలీసులు సేకరించారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ బృందం నేరంపై దర్యాప్తు చేస్తున్నాయని జీఆర్‌పీ కమిషనర్ క్వైజర్ ఖలీద్ తెలిపారు. రైలు ప్రయాణికుల నుంచి నిందితులు రూ .96,390 విలువైన ఆస్తులను దొంగిలించారని తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ .34,200 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. నిందితులపై ఐపీసీ 395, 397, 376(డీ), 354 సెక్షన్ల కింద జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.
With reference to Kalyan RPS CR. No. 771/21 the victim is twenty years old and she has been taken for medical examination by our lady officer. She is fine. We are collecting all evidences. The accused are being questioned by our team. We are checking their previous records.
— Quaiser Khalid IPS (@quaiser_khalid) October 9, 2021
Read Also…. Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?