Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది… ఎందుకంటే?

భార్యాభర్తల మధ్య చిన్న, చిన్న గొడవలు జరగడం కామన్. ఇలాంటి గొడవలు ఎన్ని జరిగినా వారి మధ్య ప్రేమ, బాండింగ్ అలాగే ఉండాలి.

Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది... ఎందుకంటే?
Fish Fry
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 09, 2021 | 9:34 PM

భార్యాభర్తల మధ్య చిన్న, చిన్న గొడవలు జరగడం కామన్. ఇలాంటి గొడవలు ఎన్ని జరిగినా వారి మధ్య ప్రేమ, బాండింగ్ అలాగే ఉండాలి. గొడవలు అనేవి మధ్యలో అలా వచ్చి.. ఇలా వెళ్లే పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. కోపాలు, తాపాలు మనసులో పెట్టుకుంటే మాత్రం అవి చాలా దూరం వెళతాయి. కానీ ఒక మహిళ తన భర్తకు గుణపాఠం చెప్పేందుకు ఊహించని పని చేసింది. దీంతో వారిద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఓ మహిళ చేప వేయించే సమయంలో వీడియో తీసి తన టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేసింది. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. సదరు వీడియోను ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా వీక్షించారు. అంత వైరల్ అవ్వడానికి ఆ వీడియోలో ఏముందనేగా మీ డౌట్. నిజానికి, ఈ చేప నార్మల్ చేప కాదు. ఈ చేప సదరు మహిళ భర్త ఎంతో ఇష్టంగా పెంచుకునేది. అది అంటే అతడి ప్రాణం.

ఇటీవల ఫిష్ ట్యాంక్ శుభ్రం చేయమని ఆ మహిళ తన భర్తను పలుమార్లు కోరింది. కానీ అతడు ఆమె మాటను పెద్దగా పట్టించుకోవట్లేదు. చేపను ముద్దు చేస్తున్నాడు కానీ ఆ ట్యాంక్ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలో ఆ మహిళ తన భర్తకు సరైన గుణపాఠం చెప్పాలని ఈ షాకింగ్ పనికి పూనుకుంది.

డైలీ స్టార్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం..మియా కుర్నియావన్ తన భర్తను చాలా రోజులు ట్యాంక్ శుభ్రం చేయమని అడుగుతుంది. కానీ ట్యాంక్ శుభ్రం చేయమని ఆమె అడిగినప్పుడల్లా అతను నో చెబుతున్నాడు. ఈ విషయం చెప్పి.. చెప్పి ఆమె విసిగిపోయింది. ముందుగా సరంజామా సిద్దం చేసుకుంది. ఆపై ట్యాంక్ నుంచి చేపను తీసి వాటిలో మసాలా కుక్కి వేయించింది. ఈ దృశ్యాలను వీడియో చేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో సదరు వీడియో వైరల్‌గా మారింది.  తన ప్రియమైన పెంపుడు చేప వేయించడం చూసి, భర్త చాలా బాధపడ్డాడు. భార్య ఇలా చేయడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే, వీడియో వైరల్ అయిన తర్వాత మియా ప్లేటు ఫిరాయించింది. చేప అనారోగ్యానికి గురవ్వడంతోనే దాన్ని ఉడికించి తిన్నానని చెప్పింది. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు భార్యభర్తల మధ్య భారీ గ్యాప్ తీసుకొచ్చింది.

Also Read: పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది

ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే