Viral News: పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ… ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది

పైవాడు రాసిపెట్టి ఉంటే.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి. ఇది పెద్దవాళ్లు చెప్పే సామెత. ఎంతో అనుభవంతో వారు చెప్పిన మాట తప్పు ఎలా అవుతుంది చెప్పండి.

Viral News: పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ... ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది
Women Finds Diamond
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 09, 2021 | 9:34 PM

పైవాడు రాసిపెట్టి ఉంటే.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి. ఇది పెద్దవాళ్లు చెప్పే సామెత. ఎంతో అనుభవంతో వారు చెప్పిన మాట తప్పు ఎలా అవుతుంది చెప్పండి. ఈ సామెత నిజమే అని చెప్పే ఓ ఇన్సిడెంట్ గురించి మీకు ఇప్పుడు వివరించబోతున్నాం. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో నివశించే ఓ మహిళ ఇటీవల వాకింగ్ చేసేందుకు పార్క్‌కు వెళ్లింది. చుట్టూ చెట్లు, స్వచ్చమైన గాలి ఆమె వాకింగ్ చేస్తుండగా.. కంటికి ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా ఓ రాయి ప్రకాశిస్తూ కనిపించింది. అది పసుపు రంగులో ఉంది. ఈ రాయి భలే ఉందే అనుకుంటూ తనతో పాటు ఇంటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో ఆ మహిళకు తెలీదు. అది తన జీవితాన్ని మార్చే వజ్రమని. అవును.. మీరు వింటున్నది నిజమే. ఆ మహిళ అర్కాన్సాస్ స్టేట్ పార్కులో వాకింగ్‌కు వెళ్లినప్పుడు, 4.38 క్యారెట్ల పసుపు వజ్రం కనిపించింది. అర్కాన్సాస్ స్టేట్ పార్క్ రెగ్యులర్ పార్క్ కాదు. అక్కడ వజ్రాలు తరుచుగా దొరుకుతుంటాయి. ఎవరైనా అక్కడ వజ్రాన్ని కనుగొంటే, అది వారికే చెందుతుంది. వారే ఆ వజ్రాన్ని అమ్ముకోవచ్చు. అయితే ఈ విషయం నోరీన్ వ్రెడ్‌బర్గ్ అనే ఆ మహిళకు తెలీదు. ఆమెకు దొరికిన వజ్రం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.15 లక్షల వరకూ ఉంటుందట.

ఈ పార్క్‌లో ఇప్పటివరకు 75000 వజ్రాలు దొరికాయని సమాచారం. అయితే నోరిన్ వ్రెడ్‌బర్గ్‌కు దొరికింది అరుదైన వజ్రమే అంటున్నారు స్థానికలు. ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు అక్కడ 258 వజ్రాలు దొరికాయట. ఇక్కడ ప్రతిరోజూ 1 లేదా 2 వజ్రాలు మాత్రమే దొరికుతాయని.. వజ్రాన్ని కనుగొన్న వ్యక్తి లైఫ్ ఆరోజుతో మారిపోతుందని అక్కడివారు చెబుతున్నారు.

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవర్

ఆ విషయంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే