Telugu Acadami Scam: తెలుగు అకాడమీ నిధుల స్కామ్ కేసులో కీలక మలుపు.. మరో ముగ్గురి అరెస్ట్‌తో వెలుగులోకి మరిన్ని నిజాలు!
Telugu Acadami Funds Scam: తెలుగు అకాడమీ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. తవ్వేకొద్దీ.. కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలు కాజేసిన సొత్తును కక్కిస్తున్నారు అధికారులు.
Telugu Acadami Funds Scam: తెలుగు అకాడమీ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. తవ్వేకొద్దీ.. కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలు కాజేసిన అవినీతిపరుల నుండి.. దోచుకున్న సొత్తును కక్కిస్తున్నారు అధికారులు. తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిధుల కాజేసిన భాగోతంలో అకాడమీకి చెందిన అందరి పాత్ర ఉందని తేల్చారు. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆసొమ్ములతో స్థిరాస్తులను కోనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఈక్రమంలో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు సాయి అనుచరుడు రమణారెడ్డి, మాజీ తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏ వినయ్, నకిలీ పత్రాలతో సంబంధమున్న భూపతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురే కథ మొత్తం నడిపినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తంగా 14 మందిని అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తోంది. ఆకాడమీ అకౌంట్స్ అధికారి రమేష్‌తో పాటు సోమిరెడ్డిని ఇప్పటికే ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.
ప్రజా ధనాన్ని దోచుకున్న డబ్బు.. ఏ విధంగా దాచుకున్నారు.. ఎక్కడ దాచారు. ఎందులో పెట్టుబడులు పెట్టారనే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వెంకట్ సాయికుమార్ 35 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. మరో నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సత్తుపల్లిలో ఓ భారీ బిల్డింగ్ కొనుగోలు చేసినట్లుగా తేల్చారు. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్లు మస్తాన్ వలీ, సాధన కూడా దోచుకున్న డబ్బుతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు ఈడీ అధికారులు. తెలుగు అకాడమీ డిపాజిట్లతో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు అకాడమీ నిధులు కాజేయడానికి.. పక్కా ప్లాన్ వేశారు నిందితులు .. వీళ్ల బండారం బయటపడకపోయి వుంటే..ఈఏడాది డిసెంబర్ నాటికి మొత్తంగా రూ.320 కోట్లు కొట్టేయాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
Read Also…. Playboy Model Ju Isen: రూ. 15 కోట్ల విలువైన ఆస్థిని తన పెంపుడు కుక్క ఫ్రాన్సిస్కో కు రాసిన మోడల్.. ఎక్కడంటే