COVID-19: ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. కోవిడ్ టీకా తీసుకోకుంటే కార్యాలయాలకు రావద్దు.. ఉత్తర్వులు జారీ!

Corona Vaccine: ఉచితంగానే ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చింది. అయితే కొందరు మాత్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకాడుతున్నారు.

COVID-19: ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. కోవిడ్ టీకా తీసుకోకుంటే కార్యాలయాలకు రావద్దు.. ఉత్తర్వులు జారీ!
Covid 19 Vaccine
Follow us

|

Updated on: Oct 09, 2021 | 7:49 PM

Covid-19 Vaccine: కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో, కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్‌ వేయాలన్న ఉద్దేశంతో.. కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడిలోనే ఉంది. అయితే, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కేసులు మరోసారి రికార్డు స్థాయిల్లో నమోదవుతుండటం ఆందోళన రేపుతోంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాలో కరోనా తగ్గుముఖం పట్టిందన్న సాకుతో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు. రాజకీయ సభలు, సమావేశాలు, పండుగల పేరుతో జనాలు గుంపుగుంపులుగా తిరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని అది ఏక్షణానైనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. వీటికి తోడు పండుగలు, ఉత్సవాలు తోడవుతున్నాయి.

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగానే ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చింది. అయితే కొందరు మాత్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి క్రేజీవాల్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు దేశం అంతటికీ వర్తింపజేయాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా అక్టోబర్ 16 నుంచి ఢిల్లీ సర్కారు కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈమేరకు కేజ్రీవాల్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 16 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేసుకోవటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. కనీసం ఒక్క డోస్ టీకా కూడా వేయించుకోని వారు కార్యాలయాలకు రానివవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా ఒక్క డోసు వేయించుకునే వరకు వారి పని దినాలను సెలవు దినాలుగా పరిగణిస్తామని పేర్కొంది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ శనివారం ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్టోబర్ 15 లోపు కనీసం ఒక డోస్ టీకాను పనికి హాజరు కావాలని ఆదేశించారు. DDMA జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ జాబితాలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారికి మొదటి మోతాదు టీకా వచ్చే వరకు వారిని పనికి అనుమతించబోమని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ సంతకం చేసిన, DDMA ఉత్తర్వు ప్రకారం, భారత ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్టోబర్ 15 లోపు కనీసం ఒక టీకా మోతాదును పొందవలసి ఉంటుంది. టీకా తీసుకోని అటువంటి ఉద్యోగులు తమ కార్యాలయాలు, విద్యా సంస్థలు లేదా ఆరోగ్య సంరక్షణ సంస్థల్లోకి అక్టోబర్ 16 నుండి డోస్ వచ్చే వరకు అనుమతించకూడదని తెలిపింది. అక్టోబర్ 16 నాటికీ మొదటి డోస్ తీసుకున్న, లేదా పూర్తిగా టీకాలు వేసినట్లుగా, వారి టీకాల స్థితిని కార్యాలయం లేదా సంబంధిత HOD ద్వారా ఆరోగ్య సేతు యాప్ ద్వారా లేదా ధృవీకరించబడిర టీకా సర్టిఫికేట్‌ను తప్పనిసరిగి అందజేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలావుంటే, శనివారం ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 0.05 శాతం కోవిడ్ – 19 పాజిటివిటీ రేటు నమోదైంది. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 25,088గా ఉంది.

Read Also….  South Central Railway: వామ్మో.. ఎంత పెద్ద రైలో. 180 బోగీలు, 2 కిలోమీటర్లకు పైగా పొడవు.. వీడియో చూస్తే వావ్ అంటారు..