South Central Railway: వామ్మో.. ఎంత పెద్ద రైలో. 180 బోగీలు, 2 కిలోమీటర్లకు పైగా పొడవు.. వీడియో చూస్తే వావ్ అంటారు..
south central railway: సాధారణంగా మీకు తెలిసి ఒక రైలు పొడవు ఎంతుంటుంది. మహా అయితే హాఫ్ కిలోమీటర్, అంతకుమించి ఉండే అవకాశాలు ఉండవు కదూ! అందులోనూ గూడ్స్ రైలు ఒక్కటే ఆ మాత్రం పొడవు..
south central railway: సాధారణంగా మీకు తెలిసి ఒక రైలు పొడవు ఎంతుంటుంది. మహా అయితే హాఫ్ కిలోమీటర్, అంతకుమించి ఉండే అవకాశాలు ఉండవు కదూ! అందులోనూ గూడ్స్ రైలు ఒక్కటే ఆ మాత్రం పొడవు ఉంటుంది. మరి రెండు కిలోమీటర్లకుపైగా పొడవుతో ఉండే రైలు ఉంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ దక్షిణ మధ్య రైల్వే దీనిని నిజం చేసి చూపించింది. గుంతకల్ డివిజన్‌లో తొలిసారి ఈ పొడవైన రైలును రైల్వే అధికారులు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే గుంతకల్ డివిజన్‌లో తొలిసారి అతిపెద్ద గూడ్స్ రైలును రైల్వే అధికారులు నడిపించారు. గరుడా పేరుతో ఉన్న రైలులో మొత్తం మూడు రైల్వే ర్యాకులను ఒకచోట కలిపారు. 180 బోగీలు ఒక చోట చేర్చారు. దీంతో ఈ రైలు పొడవు ఏకంగా 2.06 కిలోమీటర్లుగా మారింది. ఇక టెస్ట్ డ్రైవ్‌లో భాగంగా ఈ రైలును కేపీసీసీ/యాదలపూర్ నుంచి సులేహల్లి వరకు సుమారు 72 కిలోమీటర్లు నడిపించారు. ఇంతకీ ఇంత పెద్ద రైలు ఎందుకనేగా.. వస్తువుల రవాణాలో సమయంతో పాటు సిబ్బందిని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పెద్ద రైలుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ పొడవైన రైలు ఎలా ఉందో మీరూ ఓ సారి చూసేయండి..
For the 1st time Guntakal Divn, SCR operated a long haul Goods Train “Garuda” by clubbing 3 empty rakes (180 Wagons) with a length of 2.06 Kms.
Operated from KPCC/Yadalapur to Sulehalli covering a distance of 72 Kms. For improving mobility by saving time,crew & path pic.twitter.com/WSe48E8IrT
— South Central Railway (@SCRailwayIndia) October 9, 2021
High Court: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?