High Court: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది.
High Court Justice: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల నియామకం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నియమాకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్వర్వులు జారీ చేశారు. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసారు రాష్ట్రపతి.