Coal Shortage in India: విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిల్‌.. దేశంలో కరెంట్‌ సంక్షోభం తప్పదా..!

దేశంలో ఎప్పుడూ లేని సంక్షోభం. నాలుగైదు నెలలు కరెంట్‌ కోతలు. కోల్‌ కొరత ముచ్చెమటలు పట్టిస్తోంది.

Coal Shortage in India: విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిల్‌.. దేశంలో కరెంట్‌ సంక్షోభం తప్పదా..!
Oal Shortage In India
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 09, 2021 | 5:07 PM

Coal Shortage in India: దేశంలో ఎప్పుడూ లేని సంక్షోభం. నాలుగైదు నెలలు కరెంట్‌ కోతలు. కోల్‌ కొరత ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో.. వాట్‌ నెక్స్ట్‌ అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజంగానే దేశంలో కరెంట్ సంక్షోభం తప్పేలా లేదు. బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో థర్మల్‌ ప్లాంట్‌లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. బొగ్గుపై ఎక్కువ ఆధారపడటమే సంక్షోభానికి కారణమని చెబుతోంది కేంద్రం.

మరో నాలుగైదు నెలలో దేశంలో విద్యుత్‌ సంక్షోభం తప్పేలా లేదు. కోతల ముప్పు పొంచి ఉంది. విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటి పోయాయి. NTPC, TATA పవర్, టొరెంట్‌ పవర్‌ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు ఉంటే వాటిలో సగానికిపైగా ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. సుమారు ఒక్కో ప్లాంట్‌లో 80వేల టన్నుల బొగ్గు కొరత ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల వరదనీరు గనుల్లోకి చేరింది. దాంతో పలుచోట్ల బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. రవాణా ఆగిపోయింది. బొగ్గు కొరతతో విద్యుత్‌ వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది.

విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం ఉంది. బొగ్గు నిల్వల్లో వాల్డ్‌వైజ్‌ భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అంతేకాదు వాల్డ్‌వైజ్‌ రెండో అతిపెద్ద బొగ్గు దిగుమతి దారు కూడా భారతదేశమే. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత ఇండస్ట్రీయల్‌ సెక్టార్‌ ఊపందుకుంది. కరెంట్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. సెప్టెంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద 81 లక్షల టన్నులు బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 76 శాతం తక్కువ. ప్రస్తుతం 60 వేల నుంచి 80 వేల టన్నుల కొరతతో ఒక్కో ప్లాంట్ నడుస్తోంది. వాల్డ్‌వైజ్‌ విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో టాప్‌-2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే ఇండియా అసాధారణ విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో నాలుగైదు నెలలు కరెంట్ కష్టాలు తప్పవని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ హెచ్చరించారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటంతో డిమాండ్‌ కొంత తక్కువగా ఉందన్నారు. NTPC, కోల్‌ ఇండియాతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇదిలావుంటే, బొగ్గు కొరతపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ విజృంభణ అనంతరం విద్యుత్ డిమాండ్ పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. కాగా, విద్యుత్‌ రంగంలో సంక్షోభానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు PAC చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌. ముందు చూపులేకపోవడం, నిర్లక్ష్యం వల్లే బొగ్గు నిల్వలు తగ్గాయన్నారు. గత ఒప్పందాలు భారం అంటూనే అధిక ధరలకు విద్యుత్‌ను ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు పయ్యావుల.

మరోవైపు, . తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలలో ఒక రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. తక్షణమే బొగ్గు సరఫరా, గ్యాస్ సరఫరాను అందించాలి. లేదంటే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్‌ ధర 20 రూపాయలకు పెంచారు. దీన్ని నియంత్రించాలి. విద్యుత్తు కొరతను అధిగమించేందుకు అవకాశాన్ని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను. సంక్షోభాన్ని అధిగమించేందుకు సాధ్యమైనంత మేర పని చేస్తున్నాం. అంతేకాక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాశానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

బొగ్గు కొరతను కేంద్ర సర్కార్‌ సవాల్‌గా తీసుకుంది. విదేశాల నుంచి బొగ్గును తీసుకొచ్చే యోచనలో ఉంది. ప్రస్తుతానికి, సరఫరా, డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

Read Also… MAA Elections 2021: విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్లలో ఎవరెవరు ఉన్నారు? ‘మా’ బాక్సింగ్ రింగ్‌లో విజేత ఎవరు?