AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danish PM India Tour: ప్రధాని మోడీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. భారత పర్యటనలో డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ శనివారం అన్నారు.

Danish PM India Tour: ప్రధాని మోడీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. భారత పర్యటనలో డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్
Danish Pm Inida Tour
Balaraju Goud
|

Updated on: Oct 09, 2021 | 4:41 PM

Share

Danish PM Inida Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ శనివారం అన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు స్ఫూర్తిదాయకం, ఎందుకంటే ఒక మిలియన్ గృహాలకు పరిశుభ్రమైన నీరు అందించడంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.. అని డెన్మార్క్ ప్రధాని పేర్కొన్నారు.

డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మూడు రోజుల భారత పర్యటన కోసం శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మినాక్సీ లేఖి ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. మాట్ ఫ్రెడెరిక్సన్ అక్టోబర్ 9 నుండి 11 వరకు భారతదేశంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన ద్వైపాక్షిక చర్చలు జరుపారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు నియమాల ఆధారంగా అంతర్జాతీయంగా అనేక దేశాల వ్యవస్థలు నడుస్తున్నాయని ఫ్రెడెరిక్సెన్ పేర్కొన్నారు. భారతదేశం – డెన్మార్క్ మధ్య సహకారం మరింత మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలను మార్చుకున్న తర్వాత డెన్మార్క్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం – డెన్మార్క్ మధ్య హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలలో సుదూర ఆలోచనలకు చిహ్నమని ప్రధాని మోడీ అన్నారు. “వర్చువల్ సమ్మిట్‌లో భారతదేశం – డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను స్థాపించడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము. ఇది మన రెండు దేశాలలో పర్యావరణం పట్ల సుదూర ఆలోచనకు, గౌరవానికి సంకేతం” అని ప్రధాని మోడీ అన్నారు. “మా వర్చువల్ సమ్మిట్ సమయంలో, మేము మా రెండు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు, మేము దీనిపై నిబద్ధతను సమీక్షించాము” అని ఆయన చెప్పారు.

❁ భారత్ – డెన్మార్క్ మధ్య సంతకం చేసిన నాలుగు ఒప్పందాలలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్, ఆర్హస్ యూనివర్సిటీ, డెన్మార్క్, భూగర్భ జల వనరులు, జలాశయాల మ్యాపింగ్‌పై జియోలాజికల్ సర్వే ఆఫ్ మెమోరాండం ఉన్నాయి.

❁ రెండవ ఒప్పందం సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ మరియు డానిష్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్ మధ్య సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ ఒప్పందంపై సంతకం చేశారు.

❁ ఇక, మూడో ఒప్పందం ప్రకారం.. బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డాన్‌ఫాస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మూడవ అవగాహన ఒప్పందంలో ఉష్ణమండల వాతావరణం కోసం సహజ రిఫ్రిజిరేటర్‌ల కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

❁ నాల్గోవ ఒప్పందం స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం, డెన్మార్క్ రాజ్యం ప్రభుత్వం మధ్య జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్.

Read Also…. Viral Video: ఇదేంటి ఈ తోక ఇలా ఊగుతోంది.? పిల్లి, చిలకల మధ్య జరిగిన ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే.

China Sparrow War: పంటలు తింటున్నాయని 30 లక్షల పిచ్చుకలను చంపేసిన చైనా.. ఆ పాపం ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే