China Sparrow War: పంటలు తింటున్నాయని 30 లక్షల పిచ్చుకలను చంపేసిన చైనా.. ఆ పాపం ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే

China Sparrow War: ప్రకృతితో మానవులకు విడదీయరాని అవినాభావ‌ సంబంధం ఉంది. మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుంది. అయితే అత్యాశతో..

China Sparrow War: పంటలు తింటున్నాయని 30 లక్షల పిచ్చుకలను చంపేసిన చైనా.. ఆ పాపం ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే
China Sparrow War
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2021 | 4:16 PM

China Sparrow War: ప్రకృతితో మానవులకు విడదీయరాని అవినాభావ‌ సంబంధం ఉంది. మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుంది. అయితే అత్యాశతో జీవ ప్రపంచంలో భాగమైన మనిషి తన మనుగడనే కాకుండా మొత్తం జీవ జాతి మనుగడనే ప్రమాదంలో పడేస్తున్నాడు. వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, సమయానికి కురవని వర్షాలు, పెరిగిన ఎండలు. కరుగుతున్న మంచుకొండలు ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం మనిషి ఆధునిక విజ్ఞానం పేరుతొ చేస్తున్న పనులు.. ప్రకృతిలోని ప్రతిజీవి.. పర్యావరణ సమతుల్యానికి కారణమవుతుంది. అయితే కొన్ని జీవులను మనిషి అంతం చేసి.. తన చేతితో తన కంటినే పొడుచుకుంటున్నాడు. గ్లోబల్ వార్మింగ్ ఫలితాలు ఎలా ఉంటాయో.. 1958-61 సంవత్సరాల్లో చైనా ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తు చేసుకుందా..

పిచ్చుకలపై పగబట్టిన చైనా సర్కార్: 

1958 వ సంవ‌త్సరంలో చైనా దేశంలో పిచ్చుక‌లపై దండ‌యాత్ర చేసింది. చైనాలో పక్షులను వేటాడినట్లు ప్రపంచంలో ఏ దేశం వేటాడులేడని చెప్పవచ్చు.  అప్పటి వరకూ చైనా కూడా వ్యవసాధారిత దేశమో.. దీంతో తమ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. ఆ దిశగా అడుగులు వేస్తూ.. పారిశ్రామిక ఉత్పత్తుల‌ను పెంచే దిశ‌లో గ్రామీణ రైతుల‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.  ఎన్నో ప్రణాళిక‌లు రూపొందించింది. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడానికి చైనా సరికొత్త ఉద్యమాన్ని చేపట్టింది.

ఈ ఉద్యమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 5000 కుటుంబాలు ఒక్కటిగా ఏర్పడి.. వ్యవసాయం చేయాలనీ ప్రభుత్వం సూచింది. దీంతో పంట అధిక దిగుబడి వస్తుందని భావించింది. మొదటి సంవత్సరం ప్రభుత్వ అంచనాలు నిజం చేస్తూ.. అధిక దిగుబడిని సాధించింది. అయితే నెక్స్ట్ ఇయర్ కు ప్రభుతం నిర్దిసించిన లక్ష్యాన్ని రైతులు చేరలేదు. దీంతో ఆహారం కొరత ఏర్పడింది. దీనికి కారణం చైనాలో ఒక పిచ్చుక ఒక ఏడాదిలో 6.5 కేజీల బియ్యం తింటున్నాయని ఈ ధాన్యం అంతా పిచ్చుకలు తినకుండా చేస్తే.. సుమారు 60 వేల మందికి ఆహారం దొరుకుతుందని అధికారులు ప్రభుత్వనికి లెక్కలు చెప్పారు.

ల‌క్షల సంఖ్యలో పిచ్చుక‌లు హ‌తం: 

ఏడాదికి పిచ్చుక తింటున్న ఆహారం వలెనే దేశంలో ఆహారం కొరత ఏర్పడిందని ప్రభుత్వం నమ్మి..  ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో ప్రజలంద‌ర్నీ పిచ్చుక‌ల‌పై యుద్ధం చేయాల్సిందిగా అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రజ‌లంతా పిచ్చుకలు వలలు పన్ని పట్టుకుని చంపేశారు, మరికొందరు విషయం పెట్టి.. ఇంకొందరు చెట్లపై పిచ్చుకలు వాలకుండా డబ్బులు శబ్దాలు చేస్తూ.. పిచ్చుక గూళ్ళను,గుడ్లను నాశనం చేశారు. చివరకు పిచ్చిక పిల్లని కూడా వదలకుండా సుమారు  30 లక్షల పిచ్చుకలు వెంటాడి వెంటాడి చంపేశారు.

బహుమతులు: 

ఎక్కువ పిచ్చుకలు చంపిన పాఠ‌శాల‌లు, ప్రభుత్వ కార్యాల‌యాల‌కు ప్రభుత్వం బహుమతులు ఇచ్చింది. అయితే మరణించిన పిచ్చుకల జీర్ణ వ్యవ‌స్థ లోని ప‌దార్థాల‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు షాక్ తిన్నారు.   పిచ్చుక పొట్టలో మూడు వంతులు పంట‌ల‌ను నాశనం చేసే క్రిమికీట‌కాలు ఉండ‌గా ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజ‌లు ఉన్నాయి. అయితే అప్పటికే చైనాకు జరగాల్సిన నష్టం చవిచూసింది.

1958-61 మధ్యలో తీవ్ర  క‌రువు : 

పిచ్చుకలు చనిపోవడంతో మిడ‌త‌ల‌ పంటలపై దాడి చేయడం మొదలు పెట్టాయి. పంటలు నాశనం అయ్యాయి.  అతిపెద్ద క‌రువు ఏర్పడింది. దీంతో మిడ‌త‌ల‌ను చంప‌డానికి క్రిమి కీటకాల నాశకాలను ఎక్కువగా ఉపయోగించారు. దీంతో భూమిలోని సారం తగ్గిపోయింది. పిచ్చుకలను చంపేయడం వలన పంటలన్నీ పురుగులు పట్టి తినడానికి తిండి దొరకని పరిస్తితి ఏర్పడింది. 1958-61 సంవత్సరంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. సుమారు 4.5 కొట్లమంది ఆకలితో మరణించారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి చైనా ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకుంది. చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకునే కంటే.. ఈ సంఘటనను ఇప్పుడు మనిషి గుర్తు పెట్టుకుని వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన భాద్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.

Also Read:  మైనర్ బాలిక మృతి విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి.. రెండు నెలలుగా లైంగికదాడి..