Video: హైదరాబాద్ పాలిట విలన్.. కట్‌చేస్తే.. సెంచరీతో నంబర్ 1గా సిరాజ్ మియా
Mohammed Siraj Completes 100 Wickets: ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ప్రదర్శన కారణంగా మహమ్మద్ సిరాజ్‌ను టీం ఇండియా నుంచి తొలగించారు. రోహిత్ శర్మ తన సామర్థ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తాడు. సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. కానీ, ఈ ఆటగాడు ఐపీఎల్ 2025లోకి వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. IPL 2025లో సిరాజ్ ఇప్పటివరకు 7 వికెట్లు పడగొట్టాడు.

Mohammed Siraj Completes 100 Wickets: మహ్మద్ సిరాజ్ ఆర్‌సీబీని విడిచిపెట్టినప్పటి నుంచి అతని వైఖరిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సిరాజ్ విధ్వంసం సృష్టించాడు. మొదట ముంబైపై, ఆ తర్వాత ఆర్‌సీబీపై, ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సిరాజ్ తన మ్యాజిక్‌ను చూపించాడు. పవర్ ప్లేలో సిరాజ్ విధ్వంసకర బౌలింగ్‌తో హైదరాబాద్ జట్టుకు బిగ్ షాకిచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇద్దరు తుఫాన్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను పెవిలియన్ చేర్చాడు. దీంతో సిరాజ్ ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు.
సిరాజ్ @ 100..
ఐపీఎల్ చరిత్రలో 100 వికెట్లు తీసిన 26వ బౌలర్, 12వ భారత ఫాస్ట్ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
పవర్‌ప్లే సూపర్‌హీరో..
Hyderabad + New ball = Miyan Magic!#MohammedSiraj rocks #SRH early with the big wicket of #TravisHead in the opening over! 👊🏻
Watch LIVE action ➡ https://t.co/meyJbjwpV0#IPLonJioStar 👉 SRH 🆚 GT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2… pic.twitter.com/Vokiul9meR
— Star Sports (@StarSportsIndia) April 6, 2025
సిరాజ్‌కి పవర్ ప్లే అంటే ఎంత ఇష్టమో మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2022 నుంచి పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్‌ప్లే సమయంలో అతని బౌలింగ్ నైపుణ్యాలు ప్రత్యర్థి జట్లకు సమస్యగా మారుతున్నాయి. ఈ సీజన్‌లో కూడా సిరాజ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సిరాజ్ పేరు మీద ఐపీఎల్ 2025లో 6 వికెట్లు ఉన్నాయి.
అదిరిపోయే రీఎంట్రీ..
ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ప్రదర్శన కారణంగా మహమ్మద్ సిరాజ్‌ను టీం ఇండియా నుంచి తొలగించారు. రోహిత్ శర్మ తన సామర్థ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తాడు. సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. కానీ, ఈ ఆటగాడు ఐపీఎల్ 2025లోకి వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. IPL 2025లో సిరాజ్ ఇప్పటివరకు 7 వికెట్లు పడగొట్టాడు. కొత్త, పాత బంతులతో అతని ప్రదర్శన బాగుంది. కీలక విషయం ఏమిటంటే అతను విరాట్, రోహిత్ ఇద్దరినీ అవుట్ చేయడంలో విజయం సాధించాడు. సిరాజ్ కోసం రూ.12.25 కోట్లు ఖర్చు చేయాలనే గుజరాత్ టైటాన్స్ నిర్ణయం సరైనదేనని స్పష్టంగా తెలుస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




