AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్ !! గౌతమ్ గంభీర్ కు షాక్

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 1:50 PM

Share

భారత్ పేసర్ మహమ్మద్ షమీ భారత జట్టులోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. BCCI పాత ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే కొత్త రూట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కారణంగా దూరమైన ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలని BCCI ప్లాన్ చేస్తోంది. షమీ 2023 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత గాయపడినా, ఇప్పుడు అతనిని 2027 ప్రపంచ కప్ కోసం పరిశీలిస్తున్నారు. దేశవాలి ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంది.

భారత్ పేసర్‌ మొహమ్మద్‌ షమీకి మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కొత్త రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాత ప్లేయర్లకు మళ్ళీ అవకాశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గౌతమ్ గంభీర్ కారణంగా జట్టుకు దూరమైన ప్లేయర్ల అందరిని మళ్లీ తీసుకువచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చాలా రోజులుగా టీమిండియా కు దూరం అయిన మహమ్మద్ షమీ, జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినబడుతుంది. ఇదే జరిగితే, గౌతమ్ గంభీర్ కు షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ విపరీతమైన వేగంతో బౌలింగ్ చేస్తాడు. అదే సమయంలో వికెట్లు కూడా తీయడంలో దిట్ట. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో లీడింగ్ వికెట్ టేకర్ గా మహమ్మద్ షమీ నిలిచాడు. ఆ తర్వాత గాయపడిన మహమ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. అప్పటినుంచి అతనికి సరిగ్గా బీసీసీఐ అవకాశాలు ఇవ్వడం లేదు. దీనికి ముఖ్య కారణం గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. చాలాకాలంగా పక్కనపెట్టిన షమీ విషయంలో బిసిసిఐ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు అతన్ని పరిశీలిస్తున్నారట. షమీ దేశ వాలి ప్రదర్శన అద్భుతంగా ఉంది. పునరాగమనం దగ్గరలోనే ఉందని బీసీసీఐ వర్గాలు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కు కూడా అతడు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. గౌతమ్ గంభీర్ తో పాటు అగార్కర్ వద్దని ఎంత వాదించిన బీసీసీఐ అస్సలు వినిపించుకోవడంలేదట. వాళ్లను కాదని షమీని సెలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు 94 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన మహమ్మద్ షమీ 339 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు

అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్‌ సాంగ్‌ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా