AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత

పెళ్లిలోకి సడన్‌ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 1:34 PM

Share

ఢిల్లీలో సిందూరం మర్చిపోయి ఆగిపోవాల్సిన పెళ్లిని ఓ ఆన్‌లైన్ డెలివరీ బాయ్ కాపాడాడు. ముహుర్తం సమయం దాటుతుండగా, వధువు కుటుంబ సభ్యులు సిందూరం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. కేవలం 16 నిమిషాల్లో డెలివరీ బాయ్ కళ్యాణ మండపానికి చేరుకొని పెళ్లిని విజయవంతం చేశాడు. ఈ అద్భుత దృశ్యం వైరల్ కావడంతో నెటిజన్లు డెలివరీ బాయ్‌ని 'సైలెంట్ సూపర్ హీరో'గా ప్రశంసించారు.

నేటి కాలంలో ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు మన జీవితంలో ఎంతగా భాగమైపోయాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆగిపోవాల్సిన పెళ్లిని జరిపించాడు ఓ డెలివరీ బాయ్‌. ఢిల్లీకి చెందిన పూజా, హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది. ఇక చివరగా వధువు నుదుట వరుడు సిందూరం దిద్దాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఎదురైంది. పూజా కార్యక్రమాల హడావిడిలో అత్యంత ముఖ్యమైన సింధూరం తీసుకురావడం మర్చిపోయారు. ఓ వైపు ముహుర్తం సమయం దాటిపోతోంది.. బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఫోన్ తీసి ఆన్‌లైన్‌లో సిందూరం ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ బాయ్‌ నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టారు. ఆ సింధూరాన్ని తీసుకుని వరుడు పెళ్లి తంతును విజయవంతంగా ముగించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వధువు స్నేహితులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డెలివరీ బాయ్ ఈ పెళ్లికి సైలెంట్ సూపర్ హీరో అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్ | ‘ధురంధర్‌’కి రూ. 90 కోట్ల నష్టం

Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు

అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్‌ సాంగ్‌ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా

Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా

Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని