పుచ్చకాయ తిన్న తర్వాత పొరబాటున పాలు తాగారో.. నేరుగా కైలాసానికే!
06 April 2025
TV9 Telugu
TV9 Telugu
వేసవి కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం మంచిది. 92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. కండరాల నొప్పులను నిరోధిస్తుంది
TV9 Telugu
వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి మరియు అనేక పోషకాలు ఉంటాయి
TV9 Telugu
ఇందులో చెడు కొలెస్ట్రాల్ బొత్తిగా ఉండదు. గుండె జబ్బులను రానీయదు. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వదు. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మనకు మంచి రోగనిరోధక శక్తి ఉంటే వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది
TV9 Telugu
పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఇంకా ఇంకా తినాలనే తపన ఉండదు. ఈ కారణం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు
TV9 Telugu
ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది శ్రేష్ఠం. పుచ్చకాయ కేలరీలు తక్కువగా ఉండే పండు. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు
TV9 Telugu
అయితే పుచ్చకాయ వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ.. దీన్ని తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగకూడదని మీకు తెలుసా? పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. అందుకే దీనిని తిన్న తర్వాత పాలు తాగితే కడుపు సమస్యలు వస్తాయి
TV9 Telugu
అలాగే పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు కూడా తాగకూడదు. ఇది జీర్ణశయాంతర ప్రేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది