అనాస పువ్వు..ఇదేదో ఫ్లవర్‌ అనుకుంటే పొరపడినట్టే..! 

Jyothi Gadda

04 April 2025

అనాస పువ్వు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అలాగే పేగు కండరాల కదలికలను మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

అనాస పువ్వులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

జీర్ణశక్తిని పెంపొందించడంలో అనాస పువ్వు సహాయపడుతుంది. కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో అనాస పువ్వు ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది.

అనాస పువ్వు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు రక్త ప్రసరణను మెరుగుపర్చడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో అనాస పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు అనాస పువ్వును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి.

అనాస పువ్వులోని యాంటీఆక్సిడెంట్లు అనేక రకాల ఇన్పెక్షన్ల నుంచి చర్మాన్ని కాపాడతాయి. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి.