AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: టాలీవుడ్‌లో తెలుగమ్మాయి జోరు.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారిన అనన్య నాగళ్ల

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ వంటి వెపన్స్ కలిగి ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్లలో అనన్య నాగళ్ళ ఒకరు.

Ananya Nagalla: టాలీవుడ్‌లో తెలుగమ్మాయి జోరు.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారిన అనన్య నాగళ్ల
Ananya Nagalla
Basha Shek
|

Updated on: Apr 06, 2025 | 8:23 PM

Share

స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారారు అనన్య నాగళ్ళ.కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంటనే ‘మల్లేశం’ తో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. వెంటనే ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.అటు తర్వాత ‘తంత్ర’ ‘పొట్టేల్’ ‘బహిష్కరణ'(వెబ్ సిరీస్) ‘ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి ఎన్నో వినూత్నమైన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. ‘తంత్ర’ ‘పొట్టేల్’ ‘బహిష్కరణ’ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా ‘తంత్ర’ హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది.

శ్రీరామనవమి స్పెషల్.. ట్రెండీ అండ్ ట్రెడిషినల్ లుక్ లో అనన్య నాగళ్ల..

అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ.ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్దం చేసుకోవచ్చు.

బాలీవుడ్ లోనూ ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..