AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alekhya Chitti Pickles: బిగ్‌బాస్‌లోకి ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ సిస్టర్స్‌! హింట్ ఇచ్చేసిన జియో హాట్ స్టార్.. వీడియో ఇదిగో

'అలేఖ్య చిట్టి పికిల్స్' గత కొన్ని రోజులుగా ఈ పేరు తెగ వినిపిస్తోంది. పచ్చళ్ల వ్యాపారం చేసుకునే ఈ ముగ్గురు సిస్టర్స్ ఇటీవల కాంట్సవర్సీ కామెంట్స్ చేసి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. మరి బిగ్ బాస్ షోకు కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే కదా!

Alekhya Chitti Pickles: బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! హింట్ ఇచ్చేసిన జియో హాట్ స్టార్.. వీడియో ఇదిగో
Alekhya Chitti Pikles
Basha Shek
|

Updated on: Apr 06, 2025 | 8:44 PM

Share

సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ సిస్టర్స్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు అయిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్లు‌ ఉన్నారు. ఆ క్రేజ్ ను ఉపయోగించుకునే గత కొన్నేళ్లుగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గడించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ తో పాటు రకరకాల పచ్చళ్లను విక్రయిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి వరకు వీరి పచ్చళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మంచి లాభాలతో నడిచింది. కానీ ఇటీవల వారు ఓ కస్టమర్ పై దారుణమైన బూతులతో విరుచుకుపడ్డారు. ‘మీ పచ్చళ్ల ధరలు మరీ అధికంగా ఉన్నాయండి’ అన్న ఒకే ఒక మాటకు అమ్మనా బూతులు తిట్టారు. సదరు కస్టమర్ ఆ ఆడియోను నెట్టింట షేర్ చేయడం, అది కాస్తా వైరలవ్వడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌పై నెగెటివిటీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్లపై మీమ్స్, ట్రోల్స్ వీడియోలు కనీసం 100 మిలియన్స్‌కు పైగానే వ్యూస్‌తో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లలో (చిట్టి, అలేఖ్య, రమ్య) ఒకరికి తప్పకుండా బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్‌ వస్తుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురిలో రమ్యకు ఈ ఛాన్స్‌ దక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మోడ్రన్‌ డ్రెస్‌లతో ఆమె చేసే రీల్స్ నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతుంటాయి కాబట్టి బిగ్ బాస్ ఆఫర్ రమ్యకే రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

తాజాగా జియో హాట్‌స్టార్‌లో పచ్చళ్లకు సంబంధించిన ఒక సీన్‌ను షేర్‌ చేశారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ ఛత్రపతి సినిమాలోని పచ్చళ్ల సీన్ వీడియోను అందులో షేర్ చేశారు. ‘ గెప్ వీ ఆర్ ఇన్ పికిల్.. ఇప్పుడు మిర్చి కావాలి అంటే.. మన హాట్ స్టార్ లోనే చూడాలి’ అంటూ ఈ వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాబట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ లో ఒకరికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఇదే విషయంపై బిగ్‌బాస్‌ రివ్యూయర్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు కచ్చితంగా బిగ్‌బాస్‌కు రావచ్చని ఆదిరెడ్డి చెప్పాడు.

జియో హాట్ స్టార్ వీడియో..

ప్రస్తుతం అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పేర్లు బాగా నోటెడ్ అయిపోయాయి. బిగ్ బాష్ షోకు కూడా కావాల్సింది ఇలాంటి ట్రెండింగ్ వ్యక్తులే. మరి ఈ ముగ్గురిలో ఎవరికీ బిగ్ బాస్ అవకాశం దక్కుతుంతో లెట్స్ వెయిట్ అండ్ సీ..

ముగ్గురిలో రమ్యకే ఎక్కువ ఛాన్స్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూపర్ 8లోకి 5 జట్లు.. తొలిసారి పిల్ల బచ్చా టీం ఎంట్రీ?
సూపర్ 8లోకి 5 జట్లు.. తొలిసారి పిల్ల బచ్చా టీం ఎంట్రీ?
40 దాటిన మహిళలకు హెచ్చరిక.. ఋతు సమస్యలకు సింపుల్‌ చిట్కాలు!
40 దాటిన మహిళలకు హెచ్చరిక.. ఋతు సమస్యలకు సింపుల్‌ చిట్కాలు!
ఫాల్గుణం.. విష్ణు పూజలకు ప్రత్యేకం.. ఈ మాసంలో వచ్చే పండగలు
ఫాల్గుణం.. విష్ణు పూజలకు ప్రత్యేకం.. ఈ మాసంలో వచ్చే పండగలు
పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం
ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన సినిమా..
ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన సినిమా..
అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం..
అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం..
ఫోన్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా..?
ఫోన్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా..?
మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని మోదీ..
మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని మోదీ..
పోలీస్ జాగిలాల శక్తి ప్రదర్శన..ఈ బ్రీడ్ జాగిలాలు త్వరలో విధుల్లో
పోలీస్ జాగిలాల శక్తి ప్రదర్శన..ఈ బ్రీడ్ జాగిలాలు త్వరలో విధుల్లో
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..
మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..