AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్! రెమ్యునరేషన్ ఏకంగా అన్ని కోట్లా?

పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో ఒక సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కాగా ఈ సినిమాలో కథానాయికగా ఓ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను తీసుకోవాలని అట్లీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అట్లీ ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం.

Allu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్! రెమ్యునరేషన్ ఏకంగా అన్ని కోట్లా?
Allu Arjun
Basha Shek
|

Updated on: Apr 04, 2025 | 7:17 PM

Share

పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపయ్యింది. ఇప్పుడు అతనితో సినిమాలు తీసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు అట్లీకి చాలా డిమాండ్ ఉంది . బాలీవుడ్ లో ‘జవాన్’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్.ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయని టాక్. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు హీరోయిన్ ఎంపిక విషయంలో అట్లీ సందిగ్ధంలో ఉన్నాడట. అయితే కొన్ని నివేదికల ప్రకారం అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. కాగా ప్రియాంక చోప్రా గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె ఇప్పుడు తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 (వర్కింగ్ టైటిల్) సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్రియాంక అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో సినిమా అంటే అట్లీకి కఠిన సవాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ‘పుష్ప 2’ తర్వాత అభిమానుల అంచనాలు అమాతం పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా తీయాలి. అందులో భాగంగానే బలమైన క్యాస్టింగ్ ను రెడీ చేసుకుంటున్నాడు. రాజమౌళి- మహేష్ బాబు సినిమాతో ప్రియాంక చోప్రాకు టాలీవుడ్‌లో క్రేజ్ పెరగడం ఖాయం. ఆ తర్వాత అల్లు అర్జున్ తో జత కడితే తమ సినిమాకు భారీ హైప్ వస్తుందని అట్లీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

భర్త నిక్ జొనాస్ తో ప్రియాంక చోప్రా డ్యాన్స్.. వీడియో

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

అట్లీ, అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో సినిమా వస్తే అంచనాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ప్రియాంక చోప్రాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాబట్టి ఆమె హీరోయిన్ అయితే తమ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం లభిస్తుందని అట్లీ భావిస్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతానికి అట్లీ తన సినిమా సన్నాహాకాల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ‘పుష్ప 2’ విజయం తర్వాత అల్లు అర్జున్ విరామం తీసుకున్నాడు. అట్లీ, అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తే అంచనాలు ఖచ్చితంగా పెరుగుతాయి

హోలీ వేడుకల్లో..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?