Tollywood: కాలేజీలో విజయ్ దేవరకొండకు సబ్ జూనియర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?
విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలోనే ఈ టాలీవుడ్ నటుడు కూడా చదువుకున్నాడు. అప్పటి నుంచే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా మారాడు. ఇటీవల ఇతను ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ఏకంగా రూ. 75 కోట్ల వసూలు చేసింది.

పై ఫొటోలో విజయ్ దేవరకొండతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు అతని పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ కమెడియన్ పేరు మార్మోగిపోయింది. ఈ కమెడియన్ గత ఏడేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకో గానీ క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. అయితే రెండేళ్ల క్రితం రిలీజైన ఓ సినిమా ఈ కమెడియన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అందులోని ఈ నటుడి పాత్ర ఆడియెన్స్ ను పిచ్చ పిచ్చగా నవ్వించేసింది. ఇప్పుడు కూడా ఇదే సినిమాకు సీక్వెల్ రిలీజ్ కాగా మరోసారి ఈ కమెడియన్ బాగా ట్రెండ్ అవుతున్నాడు. అతను ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఇందులో ఉన్నది మరెవరో కాదు మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన లడ్డూ అలియాస్ విష్ణు. రెండు సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయ్యింది. ఇదే క్రమంలో ఈ కమెడియన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది విష్ణు ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చాడనుకుంటున్నారు. కానీ ఇతను ఎప్పట్నుంచో సినిమాల్లో ఉన్నాడు. విష్ణు కూడా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణ బ్యాచ్. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిలిం లో కూడా నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
ఇక విష్ణు విజయ్ దేవరకొండ చదివిన డిగ్రీ కాలేజీలో చదువకున్నాడు. విష్ణు తన సబ్ జూనియర్ అని ట్యాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు విజయ్ దేవర కొండ. మొదట్లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన అతను ట్యాక్సీవాలా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతను పోషించిన హాలీవుడ్ పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రామన్న యూత్, మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో ఇలా చాలా సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాడు.
కాగా మ్యాడ్ సినిమాకు బెస్ట్ కమెడియన్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు విష్ణు. ఇక మార్చి 28న రిలీజయిన మ్యాడ్ స్క్వేర్ ఇప్పటికే 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో లడ్డూ అలియాస్ విష్ణు..
Manaki yedi thinnaga jaragavu gaa… Idhi anthe …
Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️
Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎
In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib
— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.