Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎంబీబీఎస్ పరీక్ష కోసం ‘మిస్ ఇండియా’ వద్దనుకుంది.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

అందాల పోటీలకు సంబంధించి మన దేశంలో 'మిస్ ఇండియా' కాంటెస్ట్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అందులో పాల్గొనాలని, విజేతగా నిలవాలని కోరుకుంటారు. కానీ ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తన మెడిసిన్ థియరీ ఎక్సామ్ ఉందని మిస్ ఇండియా పోటీల నుంచే తప్పుకుంది.

Tollywood: ఎంబీబీఎస్ పరీక్ష కోసం 'మిస్ ఇండియా' వద్దనుకుంది.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Apr 04, 2025 | 6:32 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రూలిద్దరూ ప్రముఖ నటులే. వారిద్దరి అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ ముద్దుగుమ్మ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ సైన్ చేసిన మొదటి రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఐరన్ లెగ్ అంటారేమోనన్న భయంతో సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందీ అందాల తార. అయితే సినిమా రంగంలో ఎంతో అనుభవమున్న తల్లిదండ్రుల సూచనలతో క్రమంగా కోలుకుంది. మళ్లీ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వరుసగా సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించింది. అన్నట్లు ఈ టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. నటిగా కంటే డాక్టర్ కావడమే తన మొదటి లక్ష్యమంటోంది. అందుకే ప్రతిష్ఠాత్మక మిస్ ఇండియా పోటీలను సైతం వద్దనుకుంది. మరి ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్. తాజాగా ఈ అందాల తారకు మాధవన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో. ఈ నేపథ్యంలో శివానీ రాజశేఖర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

కాగా 2022లో శివానీ రాజశేఖర్ కు ఒక బంపరాఫర్ వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే సువర్ణావకాశం లభించింది. శివానీ కూడా ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నట్లు ఎంతో సంతోషంగా ప్రకటించింది. కానీ కొన్ని రోజులకే సడెన్‌గా ఫెమినా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసింది. శివానీ ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్ రోజునే.. ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ అదే రోజున ఉన్నందున ఈ అందాల పోటీలో పాల్గొనలేకపోతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.

శివానీ రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోస్..

శివానీ రాజశేఖర్ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.