Home Town: సొంతూరి జ్ఞాపకాలు గుర్తు కొచ్చేలా! ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
ప్రస్తుతం ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఆ మధ్యన వచ్చిన 90స్ ఏ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిదే కోవలో మరో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సిరీస్ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

ఆహా ఓటీటీలో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. సొంత ఊరితో మనకున్న అనుబంధాల, జ్ఞాపకాల నేపథ్యంతో రూపొందిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ వ్యూయర్స్ ను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా మీడియాకు వేసిన స్పెషల్ ప్రివ్యూకు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆహా ఓటీటీలో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ చూస్తున్న ఆడియెన్స్ తమకు సిరీస్ బాగా నచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. రెయిన్ బో లాంటి లైఫ్ లో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసిన జర్నీ ‘హోం టౌన్’ వెబ్ సిరీస్. కొడుకు విదేశాల్లో చదువుకోవాలని కోరుకునే తండ్రిగా రాజీవ్ కనకాల, చదువులంటే ఆసక్తి లేని కొడుకుగా ప్రజ్వల్ యాద్మ..అతని ఫ్రెండ్స్ గా సాయిరామ్, అనిరుధ్ చేసే అల్లరి పనులు, ప్రజ్వల్ టీనేజ్ లవ్ స్టోరీ..ఇవన్నీ ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి.
‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో ఝాన్సీ, అనీ, రాజీవ్ కనకాల, ప్రజ్వల్ యాద్మ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. ఈ సిరీస్ కు దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫర్ కాగా…సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. మరి వీకెండ్ లో మంచి ఫన్ అండ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటున్నారా? అయితే హోమ్ టౌన్ వెబ్ సిరీస్ మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
సొంతూరితో అనుబంధాలు, జ్ఞాపకాలు గుర్తు కొచ్చేలా..
A story that feels like your own! The laughter, the emotions, and the warmth of Hometown are now yours to experience. ❤️🏡
Watch #Hometown now only on #aha#AnAhaOriginal #RajeevKanakala #Jhansi#HometownOnAha pic.twitter.com/YTVlsgZtKk
— ahavideoin (@ahavideoIN) April 4, 2025
You can leave your hometown, but can you ever leave the memories?
The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s
— ahavideoin (@ahavideoIN) March 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








