Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు స్టార్ హీరో.. 200 కోట్లకు పైగా ఆస్తులు.. ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కాస్త బ్యాగ్రౌండ్ కూడా ఉండాల్సిందే. ఇబ్బడి ముబ్బడిగా సినిమా అవకాశాలు దక్కాలంటే ఎవరో ఒకరో గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలోకచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇవేవీ లేకుండా స్వయం కృషితో ఒక్కోమెట్టు ఎదిగిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఈ స్టార్ యాక్టర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood: ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు స్టార్ హీరో.. 200 కోట్లకు పైగా ఆస్తులు.. ఎవరో తెలుసా?
Bollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Apr 04, 2025 | 8:31 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతోన్న వారిలో చాలామంది పేద కుటుంబం నుంచి వచ్చిన వారే. పొట్ట కూటి కోసం చేతికొచ్చిన పని చేసిన వారే. ఈ స్టార్ నటుడు కూడా సరిగ్గా ఇదే జాబితాలోకే వస్తాడు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అతను పొట్ట నింపుకోవడానికి చేయని ఉద్యోగం లేదు. వాచ్ మెన్ గా, సెక్యూరిటీ గార్డ్ గా, కెమిస్ట్‌గా, వెజిటేబుల్ వెండర్ గా.. ఇలా ఎన్నో రకాల పనులు చేశాడు. అదే సమయంలో బాలీవుడ్ ఆడిషన్స్ కు హాజరయ్యేవాడు. ఆడిషన్స్ లో ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు.మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా కాదనుకుంటూ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ క్రమంగా స్టార్ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ది మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్లలో ఇతను కూడా ఒకరు. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న ఈ నటుడి ఆస్తి సుమారు రూ.200 కోట్లకు పైగానే ఉంటోంది. ఇక విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కార్లు.. ఇలా తన కష్టానికి తగ్గ లగ్జరీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నాడీ స్టార్ యాక్టర్. ఇంతకీ అతనెవరో తెలుసా? బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ.

ఇవి కూడా చదవండి

సినిమాల్లో రావడానికి ముందు నవాజుద్దీన్ చాలా పనులు చేశాడు. ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్ గా, వడోదరలో కెమిస్ట్‌గా పని చేశాడు. ఆ తర్వాత ముంబై వచ్చి పొట్ట కూటి కోసం కూరగాయలు అమ్మాడు. ఆ తర్వాత వర్క్‌షాపులకు వెళుతూ నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో నవాజుద్దీన్ కు సినిమా అవకాశాలు అంత త్వరగా రాలేదు. కొన్ని సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా ఆ తర్వాత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ సినిమా నవాజుద్దీన్ కెరీర్ ను మార్చేసింది. ఇందులో అతను పోషించిన ఫైజల్ ఖాన్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక దీని తర్వాత నవాజుద్దీన్ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కహానీ , ది లంచ్ బాక్స్, మంఝీ: ది మౌంటెన్ మ్యాన్, సేక్రేడ్ గేమ్స్ , మాంటో, రామన్ రాఘవ్, హరాంకోర్, థాకరే తదితర సినిమాలతో నవాజుద్దీన్ పేరు మార్మోగిపోయింది. అన్నట్లు ఈ ఫేమస్ యాక్టర్ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు సిద్ధిఖీ. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు