Coolie: రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ ‘వార్’ !
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ మల్టీ స్టారర్ మూవీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర తదితర స్టార్ హీరోలు కూడా నటిస్తన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు రజనీ మూవీపై అంచనాలు పెంచేశాయి.

పాన్ ఇండియా సినిమాలు పెరుగుతున్నందున, స్టార్ నటుల సినిమాలు ఒకే రోజు విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండుగలు, సెలవు దినాలలో కూడా, కనీసం రెండు రోజుల విరామం ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాతల శ్రేయస్సు కోరి స్టార్ హీరోలు తమ సినిమా రిలీజ్ లను గతంలో కంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది. లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ లు కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రం కూడా అదే రోజున విడుదలైంది. ఆ సినిమా కూడా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రెండు భారీ బడ్జెట్, పెద్ద స్టార్ సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క, నిర్మాతలు నష్టపోయే అవకాశముందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
రజనీకాంత్ దక్షిణాదిలో పెద్ద స్టార్. ఉత్తర భారతదేశంలో కూడా ఆయనకు భారీ అభిమానులు ఉన్నారు. అంతే కాదు మలేషియా, అమెరికా, దుబాయ్ తదితర దేశాల్లోనూ రజనీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కాబట్టి ఓవర్సీస్ లోనూ ‘కూలీ’, ‘వార్ 2’ సినిమాల మధ్య పోటీ ఉండనుంది.
ఆగస్టు 14న కూలీ వర్సెస్ వార్ 2..
Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @sunpictures @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @ArtSathees @TheCoolieMovie#CoolieFromAug14 pic.twitter.com/GQ4KH9u0N7
— Coolie (@TheCoolieMovie) April 4, 2025
‘వార్ 2’ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ గతంలో టైగర్ ష్రాఫ్ తో కలిసి ‘వార్’ సినిమాలో నటించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు హృతిక్. ‘RRR’ లాగే, ఈ సినిమాలో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య డ్యాన్స్ లు, ఫైట్లు ఓ రేంజ్ లో ఉండనున్నట్లు సమాచారం. ‘వార్ 2’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి ఈ బాక్సాఫీస్ క్లాష్ లో ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి