Naa Anveshana: బెట్టింగ్ యాప్స్ కేసు.. మరో బిగ్ బాస్ బ్యూటీ బాగోతాన్ని బయట పెట్టిన అన్వేష్.. సంచలన వీడియో
గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ల పేర్లను బయట పెట్టి హీరో అయిపోయాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. తాజాగా మరో ప్రముఖ నటి బాగోతాన్ని బయట పెడుతూ సంచలన వీడియో రిలీజ్ చేశాడీ గ్లోబల్ టూరిస్ట్.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు అలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేశాడీ గ్లోబల్ టూరిస్ట్. ఎవరెవరు ఏయే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు? ఎంతెంత సంపాదించారు? అన్న వివరాలను ఆ వీడియోలో చూపించాడు అన్వేష్. తాజాగా మరో ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ బాగోతాన్ని బయట పెట్టాడీ ప్రపంచ యాత్రికుడు. ఆమె మరెవరో కాదు ఆ మధ్యన జబర్దస్త్ జడ్జిగా ఉన్న సిరి హన్మంత్. బిగ్ బాస్ సీజన్ 5తో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి బాగా వెనకేసిందని సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. ఈ మేరకు అతను షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
‘టిక్ టాక్ వీడియోల వల్ల ఫేమస్ అయ్యింది సిరి హన్మంత్ . ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఈ క్రేజ్ తోనే నాగార్జున తనకు బిగ్ బాస్ లో అవకాశమిచ్చారు. అయితే అందులో నుండి బయటికి వచ్చిన తర్వాత నిమిషానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి మూడు బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్‌ను ప్రారంభించింది. సిరి హన్మంత్ బ్యూటీ ట్రీట్మెంట్ క్లీనిక్ ఓపెనింగ్‌కు వచ్చిన 30 మంది కూడా బెట్టింగ్ మాఫియాకు చెందినవాళ్లే. మూడు క్లీనిక్స్‌కు భారీగా పెట్టుబడి పెట్టింది. అంతేకాదు ఈ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా ఆదాయం ఆర్జించింది’ అని సిరి గురించి చెప్పుకొచ్చాడు అన్వేష్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇక సిరి హన్మంత్ తో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు అన్వేష్. టేస్టీ తేజ ఒక పనికిరాని ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అదే సమయంలో సినిమా వాళ్లతో దగ్గరి సంబంధాలు ఉండడం వల్ల బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. బిగ్ బాస్ 7 నుండి బయటికొచ్చిన తర్వాత నా అంత తోపే లేడు అనుకున్నాడు. అదే క్రమంలో బెట్టింగ్ యాప్స్ తో సంపాదించిన డబ్బుతో భారీగా షాప్స్ ఓపెన్ చేశాడు. నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే తప్పు లేదు. కానీ టేస్టీ తేజ, సిరి పేద కుటుంబం నుంచి వచ్చిన వారే. వారికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచించాలి’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు అన్వేష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.