పార్లమెంటు భవనంలోకి చొరబడేందుకు యువకుడి యత్నం.. ఉలిక్కిపడ్డ భద్రత సిబ్బంది!
కెనడియన్ పార్లమెంట్ తూర్పు బ్లాక్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో దాన్ని మూసివేశారు. పోలీసులు ప్రజలను సురక్షితమైన ప్రదేశంలో దాక్కోవాలని ఆదేశించారు. గంటల తరబడి ఆపరేషన్ తర్వాత, అనుమానితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పార్లమెంట్ హౌస్ పరిసరాలు ఇంకా లాక్‌డౌన్‌లో ఉన్నాయి.

ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ తూర్పు బ్లాక్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో ఆ బ్లాక్‌ను మూసివేశారు. పోలీసులు ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఈ సంఘటన తర్వాత, వెల్లింగ్టన్ స్ట్రీట్ మూసివేసిన పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలను రప్పించారు. గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత, పోలీసులు అనుమానిత యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఆ యువకుడు ఏ ఉద్దేశ్యంతో పార్లమెంటులోకి ప్రవేశించాడో ఇప్పటికీ తెలియదు. అయితే, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆ వ్యక్తి శనివారం(ఏప్రిల్ 5) మధ్యాహ్నం పార్లమెంట్ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి ప్రవేశించి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడని ఒట్టావా పోలీసులు తెలిపారు. దీని తరువాత, మధ్యాహ్నం 2.45 గంటలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. లోపల ఉన్నవారిని సమీపంలోని గదిలో ఆశ్రయం పొందాలని పోలీసులు కోరారు. అన్ని తలుపులు మూసి తాళం వేసిన తరువాత పోలీసులు, ఆగంతకుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, యువకుడు పార్లమెంటులోకి ప్రవేశించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు ఆ యువకుడి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఒట్టావాలోని పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందుకే ఈ మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రస్తుతం, పార్లమెంట్ హౌస్, పరిసర ప్రాంతాలలో పోలీసులు లాక్‌డౌన్ విధించారు. ఇక్కడికి ఎవరూ వెళ్ళడానికి అనుమతి లేదు. పోలీసులు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు ప్రవేశించిన ప్రాంతం, అంటే ఈస్ట్ బ్లాక్, సెనేటర్లు, వారి సిబ్బంది కార్యాలయాలు ఉంటాయి. కెనడాలో రాబోయే సమాఖ్య ఎన్నికలకు ముందు పార్లమెంట్ ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రత కట్టుదిట్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
