పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం అంటే గోధుమ రోటీల గురించి ఆలోచిస్తారు. అయితే జొన్న రొట్టెలు, రాగి రొట్టెలను తినడం మంచిదని నటి రకుల్ అంటున్నారు. ఈ రెండు రకాల రోటీలలో పోషకాలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతమట. తను పదేళ్లుగా ఈ రోటీలే తింటున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా నాజూగ్గా ఉండాలని ఆలోచించే వాళ్లు తమకు ఇష్టమైన ఆహార పదార్థాల్ని పక్కన పెట్టేస్తుంటారు. ఒకవేళ తిన్నా ఏదో తెలియని గిల్ట్ ఫీలింగ్‌కు లోనవుతుంటారనీ ‘ఫుడ్ గిల్ట్’ సమస్యను గతంలో తను కూడా ఎదుర్కొన్నా అన్నారు రకుల్. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని దూరం చేసుకొని నచ్చిన ఆహార పదార్థాల రుచిని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాదంతా ఇలాగే సంతృప్తిగా, సంతోషంగా గడుపుతానని తీర్మానించుకున్నారు రకుల్. మీ మనసులోని భయాలు, అపోహల్ని పక్కన పెట్టేయండి.. నచ్చిన ఆహారం రుచిని ఆస్వాదించండి.. తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి. మనం ఎలా కనిపిస్తున్నామన్న దాని కంటే మనం ఎంత సంతృప్తిగా, సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం. ఈ క్రమంలో ఎవరి జడ్జిమెంట్ మనకు అవసరం లేదు. ఎలాంటి ఒత్తిడి, అపరాధ భావన లేకుండానే ఈ ఏడాదిని ఆస్వాదించాలని తీర్మానించుకున్నట్లు చెబుతోంది రకుల్. డైటింగ్ అనో లేదంటే ఇతర కారణాల వల్లో నచ్చిన ఆహార పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టడం వల్ల వాటిని తీసుకోవాలన్న కోరిక రెట్టింపవుతుంది. అదే అప్పుడప్పుడూ వాటిని కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల ‘మితంగానే తింటున్నాం ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు..’ అన్న పాజిటివిటీ ఏర్పడుతుంది. ఇది ఫుడ్ గిల్ట్‌ని దూరం చేస్తుందంటున్నారు రకుల్. గోధుమ రొట్టెల స్థానంలో రాగి, జొన్న రొట్టెల వినియోగం మన గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అన్నారు రకుల్.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
