AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో

Samatha J
|

Updated on: Jan 04, 2026 | 11:41 AM

Share

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. జనవరి 01న కార్ఖానాలోని ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆశ్రయం పొందుతోన్న సీనియర్‌ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసిన సజ్జనార్ యువతకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు.

నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామల గారిని పరామర్శించాను. కష్టకాలంలో ఉన్న ఆమెను ఆదుకుని, ఈ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో చేర్పించిన మన తిరుమలగిరి ACP రమేష్‌ చొరవ అభినందనీయం. గత 18 ఏళ్లుగా వేలాది మందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న డాక్టర్ రామకృష్ణ గారి సేవ స్ఫూర్తిదాయకం’ అని తన పోస్టులో రాసుకొచ్చారు ఈయన.అందరికీ సజ్జనార్ ఓ విన్నపం చేశారు.‘వృద్ధాశ్రమాలు లేని సమాజం’ రావాలి.